Thank You: థ్యాంక్యూ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతో తెలుసా?

అక్కినేని నాగచైతన్య నటించిన ‘థ్యాంక్యూ’ చిత్రం మంచి అంచనాల మధ్య రిలీజ్ అయినా, ప్రేక్షకులకు కనెక్ట్ కావడంలో ఈ సినిమా వెనుకబడిపోయింది. దీంతో ఈ సినిమా వసూళ్లపై ప్రభావం పడింది. తొలిరోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా కేవలం రూ.2.16 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.

Thank You: థ్యాంక్యూ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతో తెలుసా?

Thank You Movie First Day Collections

Thank You: అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘థ్యాంక్యూ’ నిన్న ప్రపంచవ్యాప్తంగా మంచి బజ్ మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించడంతో ఈ సినిమా ఖచ్చితంగా ఆకట్టుకునే అంశాలు ఉంటాయని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు భావించారు. కానీ సినిమాలో ఎమోషన్ డోస్ ఎక్కువ కావడం, కమర్షియల్ అంశాలు ఏమీ లేకపోవడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిని కనబర్చలేదు.

Thank You: అక్కినేని హీరో ఆశలకు ఎసరుపెట్టిన ‘వరుణ’మామ!

అటు తొలిరోజే ఈ సినిమాకు మిక్సిడ్ టాక్ రావడం కూడా ఈ సినిమాకు మైనస్ పాయింట్ అయ్యింది. దీంతో ఈ ప్రభావం సినిమా వసూళ్లపై పడింది. తొలిరోజు భారీ వసూళ్లను రాబడుతుందని అనుకన్న థ్యాంక్యూ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.2.16 కోట్ల షేర్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. చైతూ కెరీర్ లో ఇటీవల ఇంత తక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘థ్యాంక్యూ’ నిలిచింది. ఈ సినిమాలో చైతూ పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులే పడుతున్నా, కంటెంట్ పరంగా సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదని టాక్ వినిపిస్తోంది.

Thank You: దిల్ రాజుకు థ్యాంక్యూ చెబుతున్న ఆడియెన్స్.. ఎందుకంటే?

ఇక ఏరియాల వారీగా ఈ సినిమా తొలిరోజు వసూలు చేసిన కలెక్షన్స్ ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 0.72 కోట్లు
సీడెడ్ – 0.20 కోట్లు
ఈస్ట్ – 0.14 కోట్లు
వెస్ట్ – 0.08 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.22 కోట్లు
గుంటూరు – 0.10 కోట్లు
కృష్ణా – 0.12 కోట్లు
నెల్లూరు – 0.07 కోట్లు
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 0.06 కోట్లు
ఓవర్సీస్ – 0.45 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – రూ.2.16 కోట్లు (రూ.3.70 కోట్లు గ్రాస్)