T20 World Cup 2021: ఆస్ట్రేలియన్లు బూట్లలో ఆల్కహాల్ పోసుకుని తాగడానికి కారణం..

టోర్నీ గెలిచిన వెంటనే ఆసీస్ ఆటగాళ్లలో సంతోషానికి అవధుల్లేకుండాపోయింది. సంబరాలు మొదలుపెట్టేశారు. విజయోత్సవాల్లో భాగంగానే బూట్లలో డ్రింక్స్ పోసుకుని తాగేశారు...

T20 World Cup 2021: ఆస్ట్రేలియన్లు బూట్లలో ఆల్కహాల్ పోసుకుని తాగడానికి కారణం..

T20 World Cup 2021

T20 World Cup 2021: దశాబ్ద కాల ఎదురుచూపులను సాకారం చేస్తూ.. ఎట్టకేలకు ఆస్ట్రేలియాను టీ20 వరల్డ్ కప్ 2021 ట్రోఫీ సొంతమైంది. ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఢీకొట్టి అద్భుతమైన విజయాన్ని నమోదు చేశారు. టోర్నీ గెలిచిన వెంటనే ఆసీస్ ఆటగాళ్లలో సంతోషానికి అవధుల్లేకుండాపోయింది. సంబరాలు మొదలుపెట్టేశారు. విజయోత్సవాల్లో భాగంగానే బూట్లలో డ్రింక్స్ పోసుకుని తాగేశారు. సెలబ్రేషన్స్ లో ఇలాంటి పనులేంటని అందరూ షాక్ తిన్నారు.

వాస్తవానికి ఆస్ట్రేలియాకు చెందిన పాత ఆచారాన్ని క్రికెట్‌ అభిమానులకు పరిచయం చేశారు. ఈ పద్ధతిని ‘షూయి’ అంటారు. బూట్లలో బీర్‌ పోసుకొని తాగి సెలబ్రేట్‌ చేసుకొనే ఆచారం 18వ శతాబ్ధంలో జర్మనీలో మొదలై ఆస్ట్రేలియాలో బాగా పాపులర్‌ అయింది. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియన్‌ రైడర్‌ జాక్‌ మిల్లర్‌, ఫార్ములా వన్‌ డ్రైవర్‌ డేనియల్‌ రెకిర్డోలు ‘షూయి’లను పోడియం మీదే చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత తరచూ దీనిని కొనసాగిస్తున్నారు.

రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైనికులు కూడా దాడికి ముందు.. విజయానికి తర్వాత తమ జనరల్‌ బూట్‌లో బీర్‌ పోసుకొని తాగేవారు. అలా చేయడాన్ని చాలా అదృష్టంగా భావించేవారట.

…………………………………: కమల్, విక్రమ్, సేతుపతి.. ఓ భారీ మల్టీస్టారర్!

ఆస్ట్రేలియాకు చెందిన ఏబీసీ పత్రిక దీనిని హెచ్చరిస్తూ కథనం రాసుకొచ్చింది. వెస్టరన్‌ సిడ్నీ యూనివర్శిటీలోని స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ పరిశోధనలు చేసి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. బూట్లలో హాని రహిత బ్యాక్టీరియా ఉంటుంది. ఆల్కహాల్‌ పోసి 60 క్షణాలు ఉంచినప్పటికీ.. స్టాఫలోకాకస్‌ అనే బ్యాక్టీరియా ఆనవాళ్లు ఇంకా ఉన్నాయి. అవి కడుపులోకి వెళ్తే సెప్టిసిమియా, నిమోనియా, వాంతులు, ఫుడ్ పాయిజన్ కావడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ గుర్తించారు. అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.