Jammu And Kashmir : అమర్‌నాథ్‌ యాత్రికులే లక్ష్యంగా పాక్‌ ఉగ్రవాదులు కుట్ర.. భగ్నం చేసిన బీఎస్‌ఎఫ్‌

ఇటీవల సుంజ్వాన్‌ ప్రాంతంలో సీఐఎస్‌ఎఫ్‌ బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఈ క్రమంలో బార్డర్‌లో బీఎస్‌ఎఫ్‌ ముమ్మర తనిఖీలు చేస్తుండగా... సొరంగం బయటపడింది.

Jammu And Kashmir : అమర్‌నాథ్‌ యాత్రికులే లక్ష్యంగా పాక్‌ ఉగ్రవాదులు కుట్ర.. భగ్నం చేసిన బీఎస్‌ఎఫ్‌

Bsf

Jammu and Kashmir : అమర్‌నాథ్‌ యాత్రికులే లక్ష్యంగా పాక్‌ ఉగ్రవాదులు పన్నిన కుట్రను బీఎస్ఎఫ్ భద్రతా దళాలు భగ్నం చేశాయి. జమ్మూకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద రహస్య సొరంగాన్ని గుర్తించాయి. సాంబా జిల్లాలోని చాక్‌ ఫఖిరా సరిహద్దు ఔట్‌పోస్టుకు సమీపంలో… 150 మీటర్ల సొరంగాన్ని బీఎస్‌ఎఫ్‌ గుర్తించింది. ఈ సొరంగం నుంచి భారత భూభాగంలోకి చొరబడేలా సొరంగం ఏర్పాటు చేశారు.

సొరంగం నుంచి భారత్‌లోని చివరి సరిహద్దు గ్రామానికి 700 మీటర్ల దూరంలో ఉంది. కాగా.. జూన్ 30 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఇటీవల సుంజ్వాన్‌ ప్రాంతంలో సీఐఎస్‌ఎఫ్‌ బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఈ క్రమంలో బార్డర్‌లో బీఎస్‌ఎఫ్‌ ముమ్మర తనిఖీలు చేస్తుండగా… సొరంగం బయటపడింది. ఇది పాక్‌ భూభాగం నుంచి సొరంగం ఉన్నట్లు బీఎస్‌ఎఫ్‌ ఎస్పీఎస్‌ సంధు తెలిపారు.

Terrorists: భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఇద్దరు అల్ ఖైదా ఉగ్రవాదులు అరెస్ట్!

గతంలో 2017లో అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సుపై లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 8 మంది యాత్రికులు మృతి చెందారు. దీంతో అలాంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా బీఎస్‌ఎఫ్‌ భారీగా తనిఖీలు చేపడుతోంది.