Uddhav Thackeray: మీకు ధైర్యం ఉంటే అక్కడ తేల్చుకుందాం రండి.. బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే సవాల్..

శివసేన పార్టీని అంతం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. మేం మీకు భయపడం. మీకు ధైర్యం ఉంటే ప్రజల్లోకి రండి. అక్కడ తేల్చుకుందాం. మీ దమ్మెంతో.. మా దమ్మెంతో తేలుతుంది.. అంటూ బీజేపీ అధిష్టానానికి శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు.

Uddhav Thackeray: మీకు ధైర్యం ఉంటే అక్కడ తేల్చుకుందాం రండి.. బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే సవాల్..

Uddhav

Uddhav Thackeray: శివసేన పార్టీని అంతం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. మేం మీకు భయపడం. మీకు ధైర్యం ఉంటే ప్రజల్లోకి రండి. అక్కడ తేల్చుకుందాం. మీ దమ్మెంతో.. మా దమ్మెంతో తేలుతుంది.. అంటూ బీజేపీ అధిష్టానానికి శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు. సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో ఏక్ నాథ్ షిండే సారథ్యంలోని ప్రభుత్వం నెగ్గింది. ఈ సందర్భంగా ముంబయిలోని శివసేన భవన్ లో నిర్వహించిన పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. ఈ క్రమంలో మహారాష్ట్ర బీజేపీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Maharashtra: అవును మాది ‘ఈడీ’ ప్ర‌భుత్వమే: దేవేంద్ర ఫ‌డ్న‌వీస్

శివసేనను అంతం చేసేందుకు బీజేపీ ఎత్తుగడలు వేస్తోంది. మేము బీజేపీకి ఏమాత్రం భయపడం. వారికి ధైర్యం ఉంటే రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు. తాము తప్పు చేస్తే ప్రజలే తమను ఇంటికి పంపుతారని, ఒకవేళ మీరు, మీ కొత్త వర్గం తప్పు చేశారని ప్రజలు భావిస్తే మిమ్మల్ని ఇంటికి పంపుతారని ఉద్ధవ్ అన్నారు. అసెంబ్లీని ఏకపక్షంగా నిర్వహించడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని అన్నారు. అసెంబ్లీలో ఇలాంటి ఆటలకు బదులు అందరం ప్రజాకోర్టులోనే తేల్చుకుందామంటూ బీజేపీని ఉధ్ధవ్ కోరారు.

Ajit Pawar: ‘మహా’ ప్రతిపక్ష నేతగా అజిత్ పవార్

ఇదే సమయంలో పార్టీ నేతలను ఉద్ధేశించి మాట్లాడుతూ.. ఒకవేళ ప్రజాకోర్టులో పోరాటానికి వెళ్తే అందరం ఐక్యంగా ఉండాలని ఉద్ధవ్ కోరడం గమనార్హం. ఇదిలాఉంటే మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా? ఉల్లంఘనకు గురవుతున్నాయా అనే అంశాలపై రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలు చెప్పాలని ఉద్ధవ్ కోరారు. మరోవైపు మహారాష్ట్ర ప్రతిపక్ష పార్టీగా ఎన్సీపీ అవతరించింది. ప్రతిపక్ష నేతగా అజిత్ పవార్ ఎన్సీపీ శాసనసభాపక్ష నేత జయంత్ పాటిల్ ప్రతిపాదించగా స్పీకర్ రాహుల్ నర్వేకర్ ఆమోదించారు.