Kishan Reddy: కేసీఆర్ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు: కిషన్ రెడ్డి

"సర్జికల్ స్ట్రైక్స్" పై నిజాలు బయటపెట్టాలంటూ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలపై కిషన్ రెడ్డి స్పందించారు. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు

Kishan Reddy: కేసీఆర్ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు: కిషన్ రెడ్డి

Kishan

Kishan Reddy: తెలంగాణలో హుజురాబాద్ ఎన్నికల ఫలితాల నుంచి సీఎం కేసీఆర్ తీరులో ఆందోళనతో కూడిన మార్పు వచ్చిందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. “సర్జికల్ స్ట్రైక్స్” పై నిజాలు బయటపెట్టాలంటూ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలపై కిషన్ రెడ్డి స్పందించారు. దాడికి గురైన ఉగ్రవాద సంస్థలే దాడి జరిగినట్లు అంగీకరించాయని, ఈ విషయాన్ని యావత్ ప్రపంచం అంగీకరించిన కేసీఆర్ అంగీకరించకపోవడం ఆయన వక్రబుద్ధికి నిదర్శనమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల వీరమరణాన్ని శంకిస్తూ, సైనికుల కుటుంబాల మనోభావాలు బెద్దతిసే విదంగా కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అభినందన్ అనే యుద్ధవీరుడు పాకిస్తాన్ సైన్యానికి పట్టుపడితే 24 గంటల్లో ఇండియాకు రప్పించామని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడే మాటలు పాకిస్తాన్ దేశం కూడా మాట్లాడదని కిషన్ రెడ్డి అన్నారు.

Also read: Russia-Ukraine : ఉక్రెయిన్ – రష్యా ఉద్రిక్తతలు… అప్రమత్తమైన భారత్

ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు, తీసుకున్న అంశాలు.. “దిగజారుడు- దివాలకోరు” విధంగా ఉన్నాయని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. హింసకు- దాడులకు ప్రేరేపితంగా ఉన్న వ్యాఖ్యలు ముఖ్యమంత్రి నుంచి రావడం కొత్తగా చూస్తున్నామని అన్నారు. బడ్జెట్- కేంద్రం- ప్రధాని మోడీపై సీఎం కేసీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీకి ఎవరూ శత్రువులు కాదు – ప్రత్యర్ధులు మాత్రమే ఉన్నారన్న కిషన్ రెడ్డి, బీజేపీకి, భారత దేశానికి ఉన్న ఏకైక శత్రువు పాకిస్తాన్, ఉగ్రవాదులేనని అన్నారు.

Also read: Road Accident: రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం ఖైదీ సహా ఐదుగురు మృతి

తెలంగాణ సమాజం తన ముందు బానిసల్లాగ ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నారని వ్యాఖ్యానించిన కిషన్ రెడ్డి..తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు బీజాలు వేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తరువాత కేటీఆర్ అధ్యక్షుడు అవుతారని, కానీ బీజేపీలో నడ్డా తరువాత అధ్యక్షుడు ఎవరు అవుతారో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. కేసీఆర్ డైనింగ్ టేబుల్ పై రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాలు జరుగుతాయని ఎద్దేవా చేసారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సీఎం కేసీఆర్ జట్టు కట్టడంపై స్పందించిన కిషన్ రెడ్డి.. బెంగాల్ లో ఏం జరుగుతుందో తెలుసా కేసీఆర్? అని ప్రశ్నించారు. గత ఏడేళ్లుగా దేశంలో మతకలహాలు లేవు! బాంబ్ పేలుళ్లు లేవు, కర్ఫ్యూలు లేవని కిషన్ రెడ్డి అన్నారు. గతంలో శాంతి బద్రతలు కరువై.. నెలలపాటు రోడ్లు మూసివేసి ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో.. నేడు బీజేపీ పాలనలో శాంతి నెలకొందని కిషన్ రెడ్డి తెలిపారు.

Also read: Tulasi Reddy: ప్రధానిగా రాహుల్ తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైలు పైనే: తులసి రెడ్డి

తెలంగాణలో ఉచిత కరెంట్ రైతులకే కాదు – అన్ని వర్గాల వారికి ఫ్రీగా ఇచ్చినా బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని కిషన్ రెడ్డి తెలిపారు. మోటర్లకు విద్యుత్ మీటర్లు పెట్టాలని ఏ రాష్ట్రానికి కేంద్రం ఆదేశాలు ఇవ్వలేదన్న కిషన్ రెడ్డి.. మీటర్లు పెట్టాలనే ఆలోచన కేంద్రానికి లేదని తెలిపారు. గత ఏడాది రూ.79 వేల కోట్లుగా ఉన్న యూరియా సబ్సిడీ ఈ ఏడాది రూ.లక్ష కోట్లకు పెంచామని.. గతంలో పోల్చితే ఈసారి 30 శాతానికి పైగా సబ్సిడీ పెంచి వందశాతం యూరియ సబ్సిడీ కేంద్రమే ఇస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలో ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించి రామగుండం ఎరువుల కర్మాగార స్థాపనలో పాల్గొంటారని ఆయన అన్నారు.

Also read: Jio Mobile: “గ్లాన్స్”లో రూ.1500 కోట్లు పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్ “జియో”