Google User Data : యూజర్ చనిపోతే వారి డేటాను గూగుల్ ఏం చేస్తుందో తెలుసా?

గూగుల్ యూజర్ అకౌంట్ ఉన్నంతకాలం వినియోగించుకోవచ్చు. ఒకవేళ గూగుల్ అకౌంట్ యూజర్ చనిపోతే ఆ డేటా ఏమౌతుంది? గూగుల్ మరణించినవారి డేటాను ఏం చేస్తుందో తెలుసా?

Google User Data : యూజర్ చనిపోతే వారి డేటాను గూగుల్ ఏం చేస్తుందో తెలుసా?

What Happens To Your Google Account After You Die

Google User Data Delete : గూగుల్ యూజర్ అకౌంట్ ఉన్నంతకాలం వినియోగించుకోవచ్చు. ఒకవేళ గూగుల్ అకౌంట్ యూజర్ చనిపోతే ఆ డేటా ఏమౌతుంది? గూగుల్ మరణించినవారి డేటాను ఏం చేస్తుందో తెలుసా? వాస్తవానికి బతికినంతకాలం గూగుల్ అందించే సర్వీసులను వినియోగించుకోవచ్చు. తనకు సంబంధించిన పర్సనల్ ఫైళ్లను గూగుల్ సర్వీసులైన జీమెయిల్, జీమ్యాప్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్లను స్టోర్ చేసుకుంటుంటారు. అలాగే ఫొటోలు, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్, గూగుల్ పే ట్రాన్సాక్షన్లకు సంబంధించి మొత్తం డేటా గూగుల్ జీమెయిల్ లో స్టోర్ అవుతుంది. ఇలా ప్రతి పర్సనల్ డేటాను గూగుల్ స్టోర్ చేసేస్తుంది. ఇతరులు ఎవరూ ఈ డేటాను యాక్సస్ చేసుకోకుండా ఉండేందుకు పాస్ వర్డ్ కూడా సెట్ చేసుకుంటారు.
Google Pixel 6 Prices Leak : లాంచింగ్ ముందే లీక్.. గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ ధర తెలిసిందోచ్!

అయితే ఆ యూజర్ మరణించిన తర్వాత వారి గూగుల్ అకౌంట్ ఏమౌతుంది? వారి బంధువులు దాన్ని పాస్‌వర్డ్ తెలిస్తే తప్పా యాక్సస్ చేయలేరు. ఇలా యాక్సస్ చేయలేని యూజర్ల అకౌంట్లు ఏమైపోతాయి? గూగుల్ వాటిని ఏం చేస్తుందో తెలియదు. ఈ విషయంలో గూగుల్ మన అకౌంట్ క్రియేట్ చేసినప్పుడే రెండు ఆప్షన్లను యూజర్లకు చూపిస్తుంది. కొంతమంది పాస్ వర్డ్ మరిచిపోయి అకౌంట్లను ఓపెన్ చేయరు. ఇలాంటి అకౌంట్లను గూగుల్ ఇనాక్టివ్ చేసేస్తుంది. ఇందులో వారి గూగుల్ అకౌంట్ యాక్సస్ చేసేందుకు ఎవరికి అనుమతి ఇస్తారో ఆప్షన్ ఎంచుకోవచ్చు. అలాగే ఎంతకాలానికి అకౌంట్ ఇనాక్టివ్ చేయాలో సూచిస్తుంది. ఒకవేళ అకౌంట్ ఇనాక్టివ్ అయినట్టయితే.. డేటా వినియోగించుకోవడం ఎవరెవరికి అవకాశం ఉంటుందో యూజరే నిర్ణయించుకోవచ్చు. ఆ వెసులుబాటు యూజర్ కే వదిలేసింది గూగుల్. దీనికి myaccount.google.com/inactive విజిట్ చేసి అక్కడ కొన్ని ఆప్షన్లను మార్చుకోవాల్సి ఉంటుంది.

అకౌంట్ ఇనాక్టివ్ మోడ్ ఎప్పటివరకూ ఉండాలో సెట్ చేయాలి. ధ్రువీకరణ కోసం మెయిల్ ఐడీ, పాస్వర్డ్, ఇతర వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా 18 నెలలపాటు అకౌంట్ ఇనాక్టివ్ అయిపోతుంది. అకౌంట్ ఇనాక్టివ్ అయిన వెంటనే ఆ డేటాను ఎవరెవరికి షేర్ చేయాలనుకుంటున్నారో వారి మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వారి ఇమెయిల్ అడిగితే ఆ వివరాలను కూడా నమోదు చేయాలి. మెయిల్ ఐడీ యాడ్ చేయగానే గూగుల్ పే, గూగుల్ ఫొటోస్, గూగుల్ చాట్, లోకేషన్ హిస్టరీ వివరాలను లిస్టు మాదిరిగా చూపిస్తుంది. ఏయే డేటాను యాక్సెస్ చేయవచ్చునో ఆప్షన్ ఎంచుకోవాలి.
Telegram: ఫేస్‌బుక్‌ డౌన్‌.. టెలిగ్రామ్ దూసుకెళ్లింది.. సరికొత్త రికార్డు!

ఈ ఆప్షన్ అకౌంట్ ఇనాక్టివ్ కాగానే.. లిస్టులోని ఇతర యూజర్ల గూగుల్ మెయిల్ కు అలర్ట్ వెళ్తుంది. షేర్ కావాలనుకునే డేటా వివరాలను మెయిల్ కు పంపుతుంది. ఆ విధంగా ఆ అకౌంట్లో డేటాను చూసుకోవచ్చు. అవసరమైతే డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇన్ యాక్టివ్ అయినప్పటి నుంచి మూడు నెలల వరకు మాత్రమే ఈ ఛాన్స్ అందిస్తుంది.

గూగుల్ అకౌంట్లో డేటాను శాశ్వతంగా డిలిట్ చేసుకోవచ్చు. మీ గూగుల్ అకౌంట్ డేటాను ఎవరితోనూ షేర్ చేయడం ఇష్టం లేదంటే.. స్టోర్ అయిన మొత్తం డేటాను డిలీట్ చేసేయొచ్చు. అప్పుడు మీ అకౌంట్లో ఎవరి మెయిల్ ఐడీనీ యాడ్ చేయాల్సిన పనిలేదు. పర్మినెంట్‌గా డేటా డిలిట్ చేయండి అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. అకౌంట్ ఇనాక్టివ్ అయిన మూడు నెలల తర్వాత డేటా మొత్తం పర్మెనెంట్‌గా డిలిట్ చేసేస్తుంది గూగుల్.
Electric Car : ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 750 కి.మీ ప్రయాణం