Cooking Oil Prices: వంట నూనెల ధరలు తగ్గనున్నాయా? కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి..

దేశంలో గతంలో ఎన్నడూలేని స్థాయిలో వంట నూనెల ధరలు పెరిగాయి. భారీగా పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా సన్ ఫ్లవర్ ఆయిల్‌ను...

Cooking Oil Prices: వంట నూనెల ధరలు తగ్గనున్నాయా? కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి..

Cooking Oil

Cooking Oil Prices: దేశంలో గతంలో ఎన్నడూలేని స్థాయిలో వంట నూనెల ధరలు పెరిగాయి. భారీగా పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా సన్ ఫ్లవర్ ఆయిల్‌ను భారీగా ఉత్పత్తి చేసే రష్యా, ఉక్రెయిన్ ​నుంచి కూడా సప్లయ్ ఆగిపోవడంతో ఆ నూనె ధరలు అమాంతం పెరిగాయి. గత రెండు నెలలుగా ఇదే పరిస్థితి ఉండటంతో పేద వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంట నూనెల ధరలను తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నప్పటికీ ఎలాంటి ఉపయోగం కనిపించడం లేదు. ఈ క్రమంలో గత నెల భారత్‌కు ఇండోనేషియా షాకిచ్చింది. భారత్‌కు పామాయిల్​ను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసే ఇండోనేషియా.. దాని ఎగుమతులపై ఏప్రిల్ 28నుంచి నిషేధం విధించాలని నిర్ణయించింది. ధరలను తగ్గించడానికి వంట నూనెలతో పాటు ముడి సరుకుల షిప్​మెంట్లను కూడా నిలిపేస్తామని ఇండోనేషియా ప్రెసిడెంట్​ జోకో విడోడో ప్రకటించిన విషయం విధితమే.

Edible Oil: దేశంలో సరిపడా నూనె నిల్వలున్నాయి: కేంద్రం

ఇండోనేషియా నుంచి మన దేశం ఎక్కువగా పామాయిల్ కొంటోంది. ఆ దేశం పామాయిల్ ఎగుమతులను బ్యాన్​ చేయడం వల్ల మన దేశంతో పాటు ఇతర దేశాల్లోనూ నూనెల ధరలు పెరుగుతాయి. ఇండోనేషియాతో పాటు మలేషియాలోనూ పామాయిల్ ఉత్పత్తి​తగ్గింది. డిమాండ్ కు సరిపడా సప్లయ్ లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి పామాయిల్ ధరలు బాగా పెరిగాయి. పామాయిల్​ ఎగుమతుల్లో 50శాతం వాటా ఇండోనేషియాదే కావడం గమనార్హం. ఉక్రెయిన్‌‌ యుద్ధంతో సన్‌‌ ఫ్లవర్‌‌ ఆయిల్‌‌ దిగుమతులు పడిపోవడంతో పామాయిల్ పైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో వంటనూనెల ధరలను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Cooking Oil Price Hike: సామాన్యుడిపై మరో బాంబ్.. మళ్ళీ పెరగనున్న వంట నూనె ధరలు!

ఇటీవలి ఇండోనేషియా ముడి పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించిన తరువాత ధరల పెరుగుదలను తగ్గించడానికి ఎడిబుల్ ఆయిల్ దిగుమతులపై విధించే సెస్‌ను తగ్గించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇది భారతదేశం యొక్క వస్తువుల దిగుమతుల్లో దాదాపు సగం వరకు ఉంది. పామాయిల్ సరఫరా కోసం భారతదేశం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నందున వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ 5%, అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సెస్ (AIDC)లో కోత ప్రతిపాదించే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ నిర్ణయానికి కేంద్రం ఆమోదం తెలిపితే కొంత మేర నూనె ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Cooking Oil Prices : యుక్రెయిన్‌-రష్యా యుద్ధం ఎఫెక్ట్.. భగ్గుమంటున్న వంటనూనెల ధరలు

ఇదే విషయంపై బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబన్విస్ మాట్లాడుతూ.. సెస్సు తగ్గింపు వినియోగదారుల ధరలను తగ్గించడానికి కొంతవరకు సహాయపడుతుందని తెలిపారు. అయినప్పటికీ ఇంకా పామాయిల్‌లో కొరతను ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు. సెస్సు తగ్గింపు వల్ల ధర లీటరుకు ₹2-3 కంటే ఎక్కువ తగ్గకపోవచ్చునని ఆయన అభిప్రాయ పడ్డారు. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ ఎగుమతిదారు ఇండోనేషియాతో భారతదేశం దౌత్య మార్గాల ద్వారా పరస్పర చర్చలు జరిపే అవకాశం ఉందని, ఇండోనేషియా దేశంలో పామాయిల్ సరఫరా పై విధించిన నిషేధాన్ని కొన్ని వారాల వ్యవధిలో వెనక్కి తీసుకోవచ్చని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. అదే జరిగితే వంట నూనెల ధరలు తగ్గుతాయని తెలిపారు.