Wrestlers protest: ప‌త‌కాల నిమ‌జ్జ‌నానికి బ్రేక్‌.. కేంద్రానికి 5 రోజుల గ‌డువు

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళ‌న బాట ప‌ట్టిన రెజ్ల‌ర్లు హ‌రిద్వార్ వ‌ద్ద గంగాన‌దిలో త‌మ ప‌త‌నాల‌ను నిమ‌జ్జ‌నం చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌గా రైతు నాయకుడు నరేష్ టికాయత్ జోక్యంతో వెన‌క్కి త‌గ్గారు.

Wrestlers protest: ప‌త‌కాల నిమ‌జ్జ‌నానికి బ్రేక్‌.. కేంద్రానికి 5 రోజుల గ‌డువు

Wrestlers Protest

Wrestlers: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళ‌న బాట ప‌ట్టిన రెజ్ల‌ర్లు హ‌రిద్వార్ వ‌ద్ద గంగాన‌దిలో త‌మ ప‌త‌నాల‌ను నిమ‌జ్జ‌నం చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌గా రైతు నాయకుడు నరేష్ టికాయత్ జోక్యంతో వెన‌క్కి త‌గ్గారు. త‌మ నిర్ణ‌యాన్ని వాయిదా వేసుకున్నారు.

ప‌త‌కాల‌ను నిమ‌జ్జ‌నం చేస్తామ‌ని ఈ ఉద‌యం సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌కటించిన రెజ్ల‌ర్లు సాయంత్రం హ‌రిద్వార్‌కు చేరుకున్నారు. సాక్షిమాలిక్‌, వినేశ్ ఫొగాట్‌, సంగీత త‌దిత‌రులు గంగాన‌ది ఒడ్డున ఉన్న హ‌ర్‌కీ పౌరీ ప్ర‌దేశానికి వచ్చారు. అక్క‌డ కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా దాదాపు 20 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఎంతో క‌ష్ట‌ప‌డి సాధించిన ప‌త‌కాల‌ను నిమ‌జ్జ‌నం చేయాల్సి వ‌స్తోందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ స్థితికి కార‌ణ‌మైన నేత‌ల‌పై మండిప‌డ్డారు. మ‌రో వైపున పెద్ద ఎత్తున మ‌ద్ద‌తుదారులు అక్క‌డికి చేరుకోవ‌డంతో అక్క‌డి వాతావ‌ర‌ణం ఉద్రిక్తంగా మారింది.

Wrestlers : పతకాలను గంగా నదిలో విసిరేస్తాం.. దేశ ప్రజలకు రెజ్లర్ల లేఖ

ప‌త‌కాల‌ను రెజ్లర్లు గంగా నదిలోకి నిమ‌జ్జ‌నం చేయ‌డానికి సిద్ద‌మైన వేళ రైతు నాయకుడు నరేష్ టికాయత్‌ హరిద్వార్ అక్క‌డ‌కు చేరుకున్నారు. రెజ్ల‌ర్ల‌తో చ‌ర్చించారు. ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌కు ఓర్చి సాధించిన మెడ‌ల్స్‌ను ఇలా నీటి పాలు చేయ‌డం స‌మంజ‌సం కాద‌ని ఆయ‌న వారికి న‌చ్చ‌జెప్పారు. వాళ్ల వ‌ద్ద ఉన్న మెడ‌ల్స్‌ను తీసుకున్నారు. ప్ర‌భుత్వానికి కొంత స‌మ‌యం ఇవ్వాల‌ని కోరారు.

Wrestlers Protest: రెజ్లర్లకు షాకిచ్చిన పోలీసులు.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు ఇక నో ఫర్మిషన్ ..

దీంతో రెజ్ల‌ర్లు త‌మ నిర్ణ‌యాన్ని వాయిదా వేసుకున్నారు. బ్రిజ్ భూష‌ణ్‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు కేంద్రానికి ఐదు రోజుల స‌మ‌యం ఇచ్చారు. లేని ప‌క్షంలో త‌మ పోరాటాన్ని ఉద్దృతం చేయ‌నున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా రెజ్ల‌ర్లు వెల్ల‌డించారు. రెజ్లర్ల పతకాలను న‌రేష్‌ తన వెంట తీసుకువెళ్లారు.