Yoga Mahotsav : రేపు హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో యోగా మహోత్సవ్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ కానుంది.

Yoga Mahotsav : రేపు హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్

Yoga Mahotsav (1)

Yoga Mahotsav : ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో యోగా మహోత్సవ్ నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ కానుంది. 25 రోజుల పాటు వివిధ వేదికల ద్వారా కేంద్ర సాంస్కృతిక, ఆయుష్ శాఖలు కౌంట్ డౌన్ నిర్వహించనున్నాయి. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను కేంద్ర మంత్రులు సర్వానంద సోన్ వాల, కిషన్ రెడ్డిలు పరిశీలించారు.

కేంద్ర ఆయుష్, షిప్పింగ్ శాఖల మంత్రి సర్వానంద సోన్ వాల రేపు ఉదయం జరగబోయే యోగా కార్యక్రమంలో పాల్గొంటారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భారత ప్రభుత్వం తరఫున వందరోజుల ముందు ఢిల్లీలో నిర్వహించామన్నారు. జూన్ 21న పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. 200 దేశాలు అంతర్జాతీయ యోగా డే ను జరుపుకుంటున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు.

Yoga : జీర్ణశక్తిని పెంచి, శృంగార సమస్యలు తొలగించే గోరక్షాసనం!

జూన్ 21న మోదీ ఆధ్వర్యంలో యోగా డే విజయవంతంగా జరపబడుతుందని కేంద్రమంత్రి సర్వానంద సోన్ వాల తెలిపారు. ఆయుష్ శాఖతో పాటు కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో యోగా డే నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. రేపు నగరంలో జరిగే యోగా వేడుకల్లో హైదరాబాద్ ప్రజలు పాల్గొనాలని ఆయన కోరారు.

ఏనుగుపై యోగా చేస్తూ పడిపోయిన బాబా రామ్‌దేవ్

మానవ సమాజం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించేందుకు యోగా ఉపయోగపడుతుందన్నారు. దేశంలోని 75 ప్రముఖ ప్రాంతాల్లో యోగా డే నిర్వహించబోతున్నాం అని కేంద్రమంత్రి సర్వానంద సోన్ వాల వెల్లడించారు. క్రీడాకారులు, నటులు యోగా మహోత్సవ్ లో పాల్గొంటారని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో యోగా వేడుకలు నిర్వహిస్తున్నారు.