Young Heroes Movies: పాపం చిన్న హీరోలు.. రిలీజ్ డేట్ దొరకడమే కష్టమైందే!

పెద్ద హీరోలు లైన్ లో లేకపోయినా సరే.. చిన్న హీరోలు తంటాలు పడుతున్నారు. కోవిడ్ కారణంగా ఇన్నాళ్లు వెయిట్ చేసి చేసి.. ఇప్పుడు వద్దామనుకుంటోన్న లో బడ్జెట్ సినిమాలకు.. మళ్లీ అలాంటి సినిమాలే పోటీగా మారుతున్నాయి.

Young Heroes Movies: పాపం చిన్న హీరోలు.. రిలీజ్ డేట్ దొరకడమే కష్టమైందే!

Young Heroes Movies

Young Heroes Movies: పెద్ద హీరోలు లైన్ లో లేకపోయినా సరే.. చిన్న హీరోలు తంటాలు పడుతున్నారు. కోవిడ్ కారణంగా ఇన్నాళ్లు వెయిట్ చేసి చేసి.. ఇప్పుడు వద్దామనుకుంటోన్న లో బడ్జెట్ సినిమాలకు.. మళ్లీ అలాంటి సినిమాలే పోటీగా మారుతున్నాయి. చేసేదేమి లేక కొత్త డేట్ కోసం వాయిదాబాట పడుతున్నారు. ఇప్పుడు యంగ్ హీరోలకు కూడా సరైన డేట్ దొరకడం కష్టమైపోయింది. కోవిడ్ తర్వాత పెద్ద సినిమాలన్నీ క్యూ కట్టాయి. ప్రేక్షకులను టార్గెట్ చేసి వరుసగా బరిలో నిలిచాయి. టైర్ 1 హీరోలతో పోటీ ఎందుకనుకొని టైర్ 2,3 స్టార్స్ వెనక్కి తగ్గారు. భారీ బడ్జెట్ సినిమాలు లైన్ లో లేనప్పుడు వెళ్దాంలే అని ఊరుకున్నారు. తీరా ఇప్పుడు చూస్తే చిన్న సినిమాలన్నీ ఒకేసారి పోటీపడుతున్నాయి. ఒక్క డేట్ కోసం కొందరు చిన్న హీరోలు నువ్వా నేనా అనుకుంటున్నారు. చివరికి పోటీలో ఎవరో ఒకరు తగ్గక తప్పట్లేదు.

Telugu Young Heroes: ఒక్క హిట్టుతో సెన్సేషనల్ స్టార్స్.. సినిమాల ఎంపికలో తర్జన భర్జన

నిజానికి ఈ శుక్రవారం థియేటర్స్ కి సత్యదేవ్ గాడ్సే, నాగశౌర్య కృష్ణా వృందా విహారి రావాల్సింది. కానీ ఏవో కారణాలు చెప్పి ఆ రెండు సినిమాలను వాయిదా వేశారు. అనూహ్యంగా నాగశౌర్య, సత్యదేవ్ తప్పుకుని సీనియర్ హీరో రాజశేఖర్ కు లైన్ క్లియర్ చేశారు. కానీ ఇప్పుడు ఈ యంగ్ హీరోలు కొత్త డేట్ వెతికే పనిలో పడ్డారు. చూస్తుంటే మంచి డేట్ దొరకడం నాగశౌర్య, సత్యదేవ్ లకు కష్టంగానే ఉంది.

Young Heroes: సక్సెస్ లేదు కానీ.. వరస సినిమాలను పట్టేస్తున్న లేత హీరోలు!

కొవిడ్ టైమ్ లోనూ ధైర్యంగా సినిమాలను పట్టుకొచ్చాడు నాగశౌర్య. కానీ అనుకున్న రిజల్ట్ ని దక్కించుకోలేకపోయాడు. ఇప్పుడు ఈ యంగ్ హీరో లిస్ట్ లో కృష్ణా వృందా విహారి మాత్రమే కాదు.. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, నారి నారి నడుమ మురారి, పోలీసు వారి హెచ్చరిక వంటి పెద్ద టైటిల్సే ఉన్నాయి. బట్ కృష్ణా వృందా విహారి రీలజయ్యేదెప్పుడో.. మిగతా సినిమాల సంగతి చెప్పెదెప్పుడో?

Young Heroes: కుర్రాళ్ళ యాక్షన్.. డిజాస్టరవుతున్న సినిమాలు!

అఖిల్ ఏజెంట్ కూడా అయోమయ స్థితిలోనే ఉంది. అయితే నిర్మాత అనిల్ సుంకర ఏజెంట్ పై వచ్చే రూమర్స్ ని నమ్మొద్దంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మనాలిలో ఓ షెడ్యూల్ జరుగుతుందంటూ చెప్పుకొచ్చారు. కానీ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఏజెంట్ మూవీ.. అఖిల్ కిప్పుడు చాలా ముఖ్యం. అందుకే ఎవ్వరూ లేని ఆగస్ట్ 12న రిలీజ్ ప్లాన్ చేశారు. ఇప్పుడు చూస్తే ఆ డేట్ కి ముందురోజు అన్నయ్య నటించిన లాల్ సింగ్ చద్దా, మాజీ వదిన సామ్ యశోద, నితిన్ మాచర్ల నియోజక వర్గం ఉన్నాయి. సో అయ్యగారు అఖిల్ డేట్ మార్చక తప్పదనే టాక్ నడుస్తోంది.

Young Heroes: పడుతూ లేస్తున్న యంగ్ హీరోలు.. ఒక్క బ్లాక్ బస్టర్ ప్లీజ్!

జూలై 1 కూడా టాలీవుడ్ హీరోలకు గండంగానే మారింది. రానా, గోపీచంద్, వైష్ణవ్ తేజ్.. ముగ్గరూ ఇదే డేట్ పై మనసు పారేసుకున్నారు. ఆలోచించి ఆలోచించి మారుతితో తాను చేస్తోన్న పక్కా కమర్షియల్ ను జూలై1కి గతంలో పోస్ట్ పన్ చేశాడు గోపీచంద్. ఆ తర్వాత అదే డేట్ నాక్కవాలంటూ వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగాతో ముందుకొచ్చాడు.

Young Directors: ఫ్లాప్ రీజన్ ఏదైనా.. భారం మొత్తం డైరెక్టర్లదేనా?

ఆల్రెడీ జూలై 1న పక్కా కమర్షియల్, రంగ రంగ వైభవంగా ఉండగానే రానా సైతం అదే డేట్ ను లాక్ చేశాడు. ఎన్నో నెలల నుంచి వాయిదాల పడుతూ.. అసలు థియేటర్స్ కొస్తుందా లేదా అన్న డౌట్స్ పుట్టించింది విరాటపర్వం. రానా, సాయిపల్లవి.. ఓ పీరియాడికల్ మావోయిస్ట్ బ్యాక్ డ్రాప్ మూవీ.. సో ఆటోమెటిక్ గానే సినిమాపై అంచనాలున్నాయి. ఇలాంటి సినిమాను జూలై 1న తీసుకొస్తున్నట్టు సురేశ్ ప్రొడక్షన్ ప్రకటించింది. సో పోటీ నుంచి గోపీచంద్, వైష్ణవ్ తేజ్ లో ఎవరో ఒకరు తప్పుకోక తప్పదనే టాక్ వినిపిస్తోంది.

Senior Heroes: పేరుకే సీనియర్లు.. దూకుడులో కుర్ర హీరోలతో పోటీ!

అప్పుడెప్పుడో బింబిసార టీజర్ రిలీజ్ చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు కల్యాణ్ రామ్. ఆ తర్వాత ఆగస్ట్ 5న వస్తుందంటూ పోస్టర్ పట్టుకొచ్చాడు. మళ్లీ ఇంతవరకు బింబిసారపై ఎలాంటి అప్డేట్ వదలట్లేదు. అందుకే అసలు ఆగస్ట్ 5న ఈ హిస్టారికల్ పీరియాడికల్ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అన్నది డౌట్ గానే ఉంది. బింబిసార2ను ఎన్టీఆర్ తో ప్లాన్ చేస్తున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి కానీ బింబిసార ఆగస్ట్ 5న పక్కా అనే పోస్ట్ చేయమంటున్నారు నందమూరి అభిమానులు.

Telugu Heroes: హిందీ ఆడియన్స్ కోసం నాటు స్టెప్పులకు సిద్ధమవుతున్న మన హీరోలు!

వరుసగా సినిమాలు చేస్తున్నాడు.. ఓ డేట్ ఫిక్స్ చేసుకోడానికి చాలానే కష్టపడుతున్నాడు విశ్వక్ సేన్. అనేక వాయిదాల తర్వాత ఆమధ్య పాగల్ ను.. ఈమధ్య అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాలను చూపించాడు. ఇప్పుడిక తన కొత్త సినిమాలకు సరైన డేట్స్ వెతుకుతున్నాడు. ఈ హీరో అఘోరాగా నటిస్తోన్న గామి షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. గామితో పాటూ ఓరి దేవుడా, దాస్ కా దమ్కీ లాంటి సినిమాలకు విశ్వక్ సేన్ కి రిలీజ్ డేట్స్ కావాలి.

Young Directors: ఫ్లాప్ రీజన్ ఏదైనా.. భారం మొత్తం డైరెక్టర్లదేనా?

నిఖిల్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. వీటిలో పాన్ ఇండియా ఫిల్మ్ స్పై రీసెంట్ గానే సెట్స్ పైకెళ్లింది. కాగా కార్తీకేయ2, 18 పేజీస్ ఎప్పుడో స్టార్ట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలకు మంచి డేట్స్ ను ఎప్పటినుంచో సెర్చ్ చేస్తున్నాడు నిఖిల్. మొత్తానికి జూలై 22న కార్తీకేయ2 వచ్చేందుకు సిద్ధమైంది. అయితే అల్లు అరవింద్ సమర్పిస్తోన్న 18 పేజీస్ రిలీజ్ డేట్ ను ఇంకా లాక్ చేయాల్సిఉంది.

Young Directors: కేరాఫ్ సెన్సేషన్.. స్టార్ డైరెక్టర్లను చేసిన ఒక్క సినిమా!

థియేటర్ ఎంట్రీ ఇచ్చి అల్లువారి చిన్నబ్బాయి చాలాకాలమే అవుతోంది. ప్రస్తుతం ఒకే ఒక సినిమాలో అల్లు శిరీష్ నటిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో రాకేశ్ శశి డైరెక్షన్ లో ప్రేమ కాదంటా సినిమా చేస్తున్నాడు. అనూ ఇమ్మాన్యుయేల్ ఇందులో హీరోయిన్. ఈ సినిమా కోసం కూడా డేట్ వెతికే పనిలో ఉన్నారు మేకర్స్.

Telugu Heroes: హిందీ ఆడియన్స్ కోసం నాటు స్టెప్పులకు సిద్ధమవుతున్న మన హీరోలు!

హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను పట్టాలెక్కించే హీరో ఆది సాయికుమార్. ప్రస్తుతం ఆది చేతిలో అరడజను పైగానే సినిమాలున్నాయి. వేదిక హీరోయిన్ గా జోస్ ఫ్లాంక్లిన్ డైరెక్షన్ లో జంగిల్ మూవీ చేస్తున్నాడు. పాయల్ రాజ్ పుత్ తో కిరాతక నడిపిస్తున్నాడు. అంతేకాదు సిఎస్ఐ సనాతన్, అమరన్ ఇన్ ది సిటీ చాప్టర్1, బ్లాక్ వంటి సినిమాలున్నాయి ఆది ఖాతాలో. బట్ ఒక్కదానికి ఇంతవరకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోలేదు.