Young Directors: కేరాఫ్ సెన్సేషన్.. స్టార్ డైరెక్టర్లను చేసిన ఒక్క సినిమా!

ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. అప్పటి వరకూ అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్ ని టాప్ డైరెక్టర్ ని చేసేసింది. ఒక్క సినిమా స్టార్ హీరోల డేట్స్ అన్నీ డైరెక్టర్ దగ్గరకి వచ్చేలా.

Young Directors: కేరాఫ్ సెన్సేషన్.. స్టార్ డైరెక్టర్లను చేసిన ఒక్క సినిమా!

Young Directors

Young Directors: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. అప్పటి వరకూ అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్ ని టాప్ డైరెక్టర్ ని చేసేసింది. ఒక్క సినిమా స్టార్ హీరోల డేట్స్ అన్నీ డైరెక్టర్ దగ్గరకి వచ్చేలా చేసింది. ఒక్క సినిమా ఇండియన్ సినిమాలో ఆ డైరెక్టర్ పేరుని సువర్ణాక్షరాలతో రాసేలా చేసింది. అలా ఒక్క సినిమాతో సూపర్ స్టార్లు అయిపోతున్నారు డైరెక్టర్లు. ఇలా ఒక్క సినిమాతో కేరాఫ్ సెన్సేషన్ అయ్యి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్న డైరెక్టర్స్ పై ఇంట్రస్టింగ్ స్టోరీ.

Telugu Young Directors: స్టార్ హీరోలను ఫిదా చేస్తున్న యంగ్ డైరెక్టర్స్..!

స్టార్ డమ్ రావాలంటే సంవత్సరాలు సంవత్సరాలు పని చెయ్యనవసరం లేదు. వరసపెట్టి సినిమాలు చెయ్యనవసరం లేదు. కంటెంట్ ఉన్న సినిమా ఒక్కటి చేస్తే చాలు.. ఆ సినిమాయే సూపర్ స్టార్లని చేస్తుందంటున్నారు ఈ డైరెక్టర్లు. టాలీవుడ్ లో ఒకప్పుడు పెద్ద సినిమాలు చెయ్యడం అందరికీ సాధ్యమయ్యేదికాదు. భారీ సినిమాలంటే.. రాజమౌళి, మణిరత్నం, సంజయ్ లీలా భన్సాలీ, పూరీ జగన్నాధ్, రాజుహిరానీ లాంటి పెద్ద డైరెక్టర్లకే ఆ చాన్స్ దక్కేది. టాలెంటెడ్ డైరెక్టర్లున్నా.. కమర్షియల్ పాత్ ని బ్రేక్ చేసి కొత్త డైరెక్టర్లు, కొత్త కథలతో ఎక్స్ పెరిమెంట్స్ చెయ్యడానికి రెడీగా ఉండేవారు కాదు హీరోలు. కానీ ఒక్క సినిమాతో పెద్ద కాన్వాస్ మీద కొత్త కథల్ని చెబుతూ, రికార్డులు క్రియేట్ చేస్తూ సూపర్ స్టార్స్ అవుతున్నారు టాలెంటెడ్ డైరెక్టర్లు.

New Directors: ఈ హీరోల్ని మెప్పించలేకపోతున్న కొత్త దర్శకులు.. లోపం ఎక్కడ?

రొటీన్ సినిమాలు కాకుండా పాత్ బ్రేకింగ్ మూవీస్ చేస్తూ.. ట్రెండ్ సెట్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఒక్క సినిమా కెజిఎఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో.. వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నారు ప్రశాంత్ నీల్. సౌత్ లో చిన్న సినమా ఇండస్ట్రీ అయిన కన్నడ నుంచి కెజిఎఫ్ అనే పెద్ద సినిమా చేసి 550 కోట్ల కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు ప్రశాంత్ నీల్. కెజిఎఫ్ కంటే ముందు ప్రశాంత్ జస్ట్ ఉగ్రమ్ అనే ఒకే ఒక్క సినిమా చేశారు. ఆ తర్వాత చేసిన కెజిఎఫ్ తో హిస్టరీ క్రియేట్ చేశారు ప్రశాంత్ నీల్. ఈ ఒక్క సినిమాతో ప్రశాంత్ ఇండియాస్ టాప్ డైరెక్టర్ గా అవతరించడమే కాదు.. వరస పెట్టి స్టార్ హీరోలతో సినిమా చాన్సులు కూడా దక్కించుకుంటున్నారు.

New Directors: కంటెంట్‌తో కొడుతున్న కొత్త దర్శకులు.. ప్రయోగాలు చేస్తున్న హీరోలు!

భారీ బడ్జెట్ తో అంతకంటే గ్రాండ్ విజువల్స్ తో భారీ తెరకెక్కిన కెజిఎఫ్ 2 రిలీజ్ కు ముందే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కి చాన్సిచ్చారు. నెవర్ బిఫోర్ మేకింగ్ తో అంతకముందు సినిమాలకంటే గ్రాండ్ గా సలార్ మూవీని తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. శృతి హాసన్ హీరోయిన్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సలార్ మూవీతో పాటు ఎన్టీఆర్ తో సినిమా ఛాన్స్ కూడా దక్కించుకున్నారు.

New Directors: ఏదో తడబాటు.. ఛాన్సిచ్చినా వాడుకోని డైరెక్టర్లు

క్వాలిటీ మూవీ మేకింగ్ తో తెలుగు సినిమాని ఎలివేట్ చేస్తూ.. స్టార్ హీరోలతో సినిమా ఆఫర్లను కొట్టేస్తూ.. టాలీవుడ్ ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళుతున్న సూపర్ స్టార్ డైరెక్టర్లలో నాగాశ్విన్ కూడా ఒకరు. యంగ్ డైరెక్టర్ నాగశ్విన్ కూడా డిఫరెంట్ సినిమాలు చేసి ఒక కొత్త పాత్ ని క్రియేట్ చేశాడు. హీరో అంటే సోకాల్డ్ హీరోయిజం చూపించాలి.. ఫైట్స్ చెయ్యాలి లాంటి రొటీన్ రూల్స్ లేకుండా.. జస్ట్.. కథను మాత్రమే హీరోగా చూపిస్తున్నారు నాగాశ్విన్. ఎవడే సుబ్రహ్మణ్యంతో ఎంట్రీ ఇచ్చిన నాగాశ్విన్.. ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు.

Young Heroes: సక్సెస్ లేదు కానీ.. వరస సినిమాలను పట్టేస్తున్న లేత హీరోలు!

మహానటితో ఇంపాక్ట్ చేసి మంచి స్టార్ డైరెక్టర్ అయిపోయారు నాగాశ్విన్. మహానటి సావిత్రి లాంటి అన్ ఇమాజినబుల్ స్టోరీ టెల్లింగ్ తో ఆడియన్స్ ని కన్విన్స్ చేసి సూపర్ సక్సెస్ అందుకున్నారు నాగాశ్విన్. ఇప్పుడు అదే సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ.. నెక్ట్స్ లెవల్ సినిమా చేస్తున్నారు. ప్రాజెక్ట్ కె టైటిల్ తో తెరకెక్కుతున్న ఈమూవీలో ప్రభాస్ తో పాటు అమితాబ్, దీపికా పదుకోన్ లాంటి బాలీవుడ్ స్టార్ కాస్ట్ ని బిగ్ స్క్రీన్ మీద చూపించబోతున్నారు నాగశ్విన్.

Tollywood Directors: తెలుగు సినిమాని కొత్తగా చూపిస్తున్న రూల్స్ బ్రేకర్స్!

స్టార్ హీరోలతో పెద్ద సినిమాలు చెయ్యడం ప్రతి డైరెక్టర్ కల. ఒకప్పుడు ఆ కలని కనడమే తప్ప.. నిజం చేసుకునే వాళ్లు చాలా తక్కువ మంది ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు డ్రీమ్ బిగ్ అంటూ సినిమా ఇండస్స్ట్రీకొచ్చి ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంటున్నారు యాస్పిరెంట్ టాలెంటెడ్ డైరెక్టర్లు. చాలా మంది పెద్ద సినిమాలు చేస్తూ.. ఇండియన్ సినిమాకే హైలెట్ అవుతున్నారు.

2022 Telugu Films: వేల కోట్ల తెలుగు సినిమా.. వచ్చే ఏడాదే టార్గెట్!

తెలుగు సినిమాలో పాత్ బ్రేకింగ్ మూవీ.. అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయిన సందీప్ రెడ్డి.. అసలు తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి సినిమా రాగలదా అని ఊహించేలోపే అర్జున్ రెడ్డి లాంటి హార్డ్ కోర్ సినిమా చేసి ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు. టాలీవుడ్ సోకాల్డ్ మూవీ మేకింగ్ రూల్స్ ని బ్రేక్ చేసి ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ గా సందీప్ మంచి క్రెడిట్ సాధించాడు. దాంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చేసుకున్నాడు.

Bollywood Couples: అలియా నుండి కరీనా వరకు.. మోస్ట్ హ్యాపెనింగ్ లవ్ మ్యారేజెస్!

అర్జున్ రెడ్డి ఇంపాక్ట్ బాలీవుడ్ ని కూడా తాకడంతో షాహిద్ కపూర్ పిలిపించుకుని మరీ అర్జున్ రెడ్డిని రీమేక్ చేశారు. బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ అవడంతో అక్కడ కూడా తన క్రేజ్ కంటిన్యూ చేసుకుని స్టార్ డమ్ ని కంటిన్యూ చేస్తున్నారు. లేటెస్ట్ గా రణబీర్ కపూర్ తో యానిమల్ షూటింగ్ కి రెడీ అవుతున్న సందీప్ రెడ్డి.. ప్రభాస్ తో పెద్ద సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. స్పిరిట్ టైటిల్ తో పాన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా.. 8 భాషల్లో తెరకెక్కబోతోంది.

John Abraham: మీ సినిమాలు అతిగా ఉంటున్నాయ్ సార్.. రిపోర్టర్లపై హీరో సెటైర్లు!

సౌత్ లోనే కాదు.. ఒక్క సినిమాతో స్టార్ అయిపోయిన డైరెక్టర్ ఓమ్ రౌత్ బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. తానాజీ లాంటి హెవీ యాక్షన్ హిస్టారికల్ మూవీతో ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఫస్ట్ మూవీతోనే ఎక్స్ పీరియన్సెడ్ డైరెక్టర్ ఎఫీషియన్సీ చూపించిన ఓమ్ రౌత్.. అదే క్రేజ్ తో పాన్ ఇండియా స్టార్ తో సినిమా ఛాన్స్ కొట్టేశారు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో సినిమా చెయ్యాలంటే.. అది మామూలు విషయం కాదు.. కమర్షియల్ సినిమా అయితే ఎంతో కొంత గ్యారంటీ ఉంటుంది కానీ.. ఆదిపురుష్ టైటిల్ తో మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించే సినిమా అంటే.. దానికి చాలా గట్స్ కావాలి. అసలు ఇలాంటి ఓ సబ్జెక్ట్ ని ప్రభాస్ కి చెప్పడం, ఆ స్టార్ హీరో చేత ఒప్పించడం చాలా పెద్ద టాస్క్. అలాంటి పని ఈజీగా చేసేశారు బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్. ఈ ఆదిపురుష్ తో ఓమ్ రౌత్ తన స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ని సస్టెయిన్ చెయ్యడం గ్యారంటీ అంటున్నారు జనాలు.