YS Sharmila: నీ దగ్గర అవినీతి ఎమ్మెల్యేల చిట్టా ఉన్నా.. చర్యలెందుకు తీసుకోవడం లేదు కేసీఆర్?

ఎవరో అనామకుడు ఫిర్యాదు చేస్తే వెనకాముందు ఆలోచించకుండా మంత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసావే.. మరి ఆ అనామకుడికున్న విలువ నీకు లేదా అంటూ సీఎం కేసీఆర్ పై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

YS Sharmila: నీ దగ్గర అవినీతి ఎమ్మెల్యేల చిట్టా ఉన్నా.. చర్యలెందుకు తీసుకోవడం లేదు కేసీఆర్?

YS Sharmila

YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తప్పుచేస్తే నా బిడ్డయినా, కొడుకైనా వదిలిపెట్టేది లేదు, జైలుకు పంపుడే అన్న కేసీఆర్.. అవినీతి ఎమ్మెల్యేల లిస్ట్ దగ్గర పెట్టుకొని ఎందుకు వారిని జైలుకు పంపడం లేదని షర్మిల ప్రశ్నించారు. నీ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని నువ్వే ఒప్పుకున్నావు కదా? చర్యలు తీసుకొనేందుకు ఎందుకు వెనుకడుతున్నావ్ కేసీఆర్ అంటూ నిలదీశారు. దళిత బంధులో రూ.3 లక్షల లంచం తీసుకుంటున్నారు. వాళ్ల చిట్టా ఉందని చెప్తున్నా చర్యలు మాత్రం లేవు, వారిని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించడం లేదని కేసీఆర్ ను షర్మిల ప్రశ్నించారు.

CM KCR: బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ వార్నింగ్

ఎవరో అనామకుడు ఫిర్యాదు చేస్తే వెనకాముందు ఆలోచించకుండా మంత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసావే.. మరి ఆ అనామకుడికున్న విలువ నీకు లేదా అని షర్మిల ప్రశ్నించారు. నీ దగ్గర చిట్టా ఉన్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు చర్యలు తీసుకొంటే లిక్కర్ స్కామ్‌లో నీ బిడ్డ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తారనే కదా? అంటూ విమర్శలు చేశారు. ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నా కండ్లు తుడుచుకొని చేతకాని దద్దమ్మలా చూస్తున్నావ్. అయినా నీ బంగారు బతుకమ్మే బాగా లేనప్పుడు ఇతరులను శిక్షించే అర్హత నీకెక్కడిది  కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు.

YS Sharmila : వైఎస్ వివేకాను కాదు సునీతాను చంపాలి.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

మీకు ప్రభుత్వాన్ని పాలించే స్థాయి ఎక్కడిది. అవినీతి పాలనలో మునిగి తేలిన మీకు, మీ ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెడుతారు.నీ అధికారాన్ని దూరం చేస్తారు అంటూ షర్మిల అన్నారు.