Akhanda : భం ‘అఖండ’.. 50 రోజుల ట్రైలర్ అదిరిందిగా..

నటసింహా నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన సాలిడ్ హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’ 50 రోజుల ట్రైలర్..

Akhanda : భం ‘అఖండ’.. 50 రోజుల ట్రైలర్ అదిరిందిగా..

Akhanda

Akhanda: సరైన మాస్ బొమ్మ పడితే బాక్సాఫీస్ బరిలో ఆ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనేదానికి చిన్న ఎగ్జాంపుల్ ‘అఖండ’.. నటసింహా నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కలయికలో ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత వచ్చిన సాలిడ్ హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’.

Anveshi Jain : ‘రామారావు’తో రచ్చ రంబోలా..

సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన స్టార్ హీరో సినిమా ఇదే. డిసెంబర్ 2న భారీ అంచనాల మధ్య ‘అఖండ’ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాలయ్య నటవిశ్వరూపానికి, బోయపాటి దర్శకత్వ ప్రతిభకి ప్రేక్షకాభిమానులు నీరాజనాలు పట్టారు. ఫలితం బ్లాక్ బస్టర్.

Jr NTR : ఫ్యాన్ వార్‌కి ఫుల్ స్టాప్.. వైరల్ అవుతున్న ‘సింహాద్రి’ ఓపెనింగ్ ఫొటో..

కలెక్షన్ల సునామీ సృష్టించడమే కాక బాలయ్య కెరీర్‌లో రూ. వంద కోట్ల గ్రాస్ రాబట్టి, అత్యధిక మొత్తంలో షేర్ వసూలు చేసిన సినిమాగా చరిత్ర నెలకొల్పింది. తర్వాత ‘పుష్ప’ సినిమా వచ్చినా, థియేటర్ల సంఖ్య తగ్గినా కూడా మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ అనే తేడా లేకుండా సత్తా చాటింది.

Akhanda : ‘అఖండ’ సినిమాలో కనిపించిన ఎద్దుల గురించి తెలుసా ??

త్వరలో 50 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ‘అఖండ రోరింగ్ 50 డేస్ ట్రైలర్’ పేరుతో సాలిడ్ ట్రైలర్ వదిలారు టీం. మరో వైపు ‘అఖండ సంక్రాంతి సంబరాలు’ పేరుతో టీం ప్రేక్షకులతో తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. చాలా రోజుల తర్వాత 50 రోజుల పోస్టర్ పడిన సినిమా కూడా ‘అఖండ’ నే కావడం విశేషం.