Anupama Parameswaran: కార్తికేయ కోసం ఆ పని ముగించేసిన అనుపమ!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్ చిత్రాల్లో ‘కార్తికేయ2’పై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. యంగ్ డైరెక్టర్ చందూ ముండేటి....

Anupama Parameswaran: కార్తికేయ కోసం ఆ పని ముగించేసిన అనుపమ!

Anupama Parameswaran Completes Dubbing For Karthikeya 2

Anupama Parameswaran: టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్ చిత్రాల్లో ‘కార్తికేయ2’పై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. యంగ్ డైరెక్టర్ చందూ ముండేటి తెరకెక్కిస్తున్న ఈ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాతో హీరో నిఖిల్ మరోసారి తనదైన మార్క్ సక్సెస్ అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు.

Anupama Parameswaran: సింగిల్ కాదంటూ.. తన లవ్ గురించి ట్విస్ట్ ఇచ్చిన అనుపమ!

అయితే ఈ సీక్వెల్ సినిమాలో నిఖిల్ సరసన అందాల భామ అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె పాత్ర కూడా ఈ సినిమాలో చాలా కీలకంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా ఆమె తన పాత్రకు సంబంధించిన మలయాళ డబ్బింగ్‌ను పూర్తి చేసింది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాకు సంబంధించి వివిధ భాషల్లో తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకునేందుకు ఈ చిత్ర నటీనటులు ఆసక్తిని చూపుతున్నారు.

Anupama Parameswaran : అనుపమకి కోపం తెప్పించిన ఆకతాయిలు.. ఏం చేశారో తెలుసా??

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం మేజర్ అట్రాక్షన్‌గా నిలవనుండగా, ఈ చిత్రాన్ని జూలై 22న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరణ్ పాత్ర ప్రేక్షకులను ఎంతమేర అలరిస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.