Balakrishna : మోక్షజ్ఞ ఎంట్రీ వచ్చే ఏడాది కన్ఫార్మ్.. శ్రీలీలతో బాలయ్య కామెంట్స్..

మోక్షజ్ఞ ఎంట్రీ వచ్చే ఏడాది కన్ఫార్మ్ అంటూ బాలకృష్ణ గట్టి సమాధానం ఇచ్చేశాడు.

Balakrishna : మోక్షజ్ఞ ఎంట్రీ వచ్చే ఏడాది కన్ఫార్మ్.. శ్రీలీలతో బాలయ్య కామెంట్స్..

Balakrishna about his son Mokshagna Teja debut

Balakrishna : టాలీవుడ్ సీనియర్ హీరోల్లో చిరంజీవి, నాగార్జున వారసులు వెండితెర అరగేంట్రం ఇచ్చేశారు. ఇక తెలుగు ప్రేక్షకులంతా నందమూరి వారసుడు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ.. ఇదిగో, అదిగో అంటూ ఎప్పటినుంచో కామెంట్స్ వినిపిస్తున్నాయి తప్ప ఎంట్రీ మాత్రం జరగడం లేదు. అయితే తాజాగా బాలకృష్ణ ఈ విషయం పై గట్టిగా ఒక సమాధానం ఇచ్చేశాడు. బాలయ్య ఈ దసరాకి ‘భగవంత్ కేసరి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.

ఈ సినిమాలో శ్రీలీల ఒక ముఖ్య పాత్ర చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న చిత్ర యూనిట్ ఇంటర్వ్యూలతో సందడి చేస్తుంది. ఈక్రమంలోనే బాలయ్య, శ్రీలీలతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. దీనిలో శ్రీలీల ప్రశ్నలు అడుగుతుంటే బాలయ్య సమాధానాలు ఇస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడంటూ శ్రీలీల ప్రశ్నించింది. దీనికి బాలయ్య బదులిస్తూ.. నెక్స్ట్ ఇయర్ కన్ఫార్మ్ అంటూ తెలియజేశాడు. ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

Also read : Varun Tej : మా ఫ్యామిలీనే ఒక క్రికెట్ టీం.. వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్..

ఇక ఈ వ్యాఖ్యలు విన్న నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే ఇక్కడ మరో ప్రశ్న మొదలవుతుంది. మోక్షజ్ఞ ఎంట్రీ ఏ దర్శకుడు చేతిలో ఉండబోతుందనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే బాలయ్యకి సూపర్ హిట్స్ ఇచ్చిన పలువురు దర్శకులు పేర్లు వినిపిస్తున్నాయి. అభిమానులు కూడా పలానా దర్శకుడు అయితే బాగుంటుందని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.

భగవంత్ కేసరి కలెక్షన్స్ విషయానికి వస్తే.. బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తూ ముందుకు వెళ్తుంది. మొదటిరోజే రూ.32.33 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టిన ఈ సినిమా సెకండ్ హాఫ్ సెంచరీ కొట్టేసింది. ఇక మూడో రోజు 19 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని మొత్తం మీద ఇప్పటివరకు రూ.71.02 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని నమోదు చేసింది.