NTR 100 Years : ఎన్టీఆర్ శత జయంతి.. ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించిన బాలయ్య..

నేడు ఎన్టీఆర్ శత జయంతి కావడంతో ఉదయాన్నే బాలకృష్ణ పలువురు తెలుగుదేశం నాయకులతో కలిసి వచ్చి ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ..

NTR 100 Years : ఎన్టీఆర్ శత జయంతి.. ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించిన బాలయ్య..

Balakrishna pays tributes to NTR at NTR Ghat

Balakrishna :  సినీ పరిశ్రమలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమగా కీర్తిని అందుకున్న నందమూరి తారక రామారావు తెలుగు వారిని ప్రపంచం మొత్తానికి తెలియజేసేలా చేసిన ఆయన ప్రయాణం.. చరిత్రగా ఎప్పటికి నిలిచిపోతుంది. నటుడిగా జానపధం, పౌరాణికం, సాంఘికం, చారిత్రకం.. ఇలా ప్రతి దానిలో ఆయనకి తిరుగు లేదని అనిపించుకున్నారు. కేవలం నటుడు గానే కాదు రైటర్‌గా, ఎడిటర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు కళామతల్లికి ఎన్నో సేవలు అందించారు. నటుడిగా శిఖరాగ్ర స్థాయిని అందుకున్న ఎన్టీఆర్.. ఆయనికి అంతటి స్థాయిని అందించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు ప్రజాసేవ చేయడానికి రాజకీయం వైపు అడుగులు వేశారు. తెలుగుదేశం పార్టీ పెట్టి మొదటిసారి సీఎం అయ్యి.. రాజకీయ రంగంలో కూడా తనకి తిరుగులేదు అనిపించుకున్నారు. నేటికి(మే 28 2023) ఆయన పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది. తెలుగువారంతా ఎన్టీఆర్ శత జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ ఫ్యామిలీ, తెలుగుదేశం నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు.

NTR 100 Years : ఎన్టీఆర్ శతజయంతి నేడే.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?

నేడు ఎన్టీఆర్ శత జయంతి కావడంతో ఉదయాన్నే బాలకృష్ణ పలువురు తెలుగుదేశం నాయకులతో కలిసి వచ్చి ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఎల్లప్పుడూ సజీవంగా ఉంటారు. అయన ఒక మహానుభావుడు, ఇలా అందరూ అనిపించుకోలేరు. ఆయన మహోన్నత వ్యక్తి. ఎన్నో క్లిష్ట పరిస్థితిలో నిలబడి విజయాలు సాధించారు. ఎవ్వరూ చేయని పాత్రలు చేసి సాహసం చేశారు. ఎవరూ చేయని పథకాలను ప్రవేశపెట్టారు నాయకుడిగా. ప్రజల గుండెల్లో వెలిగిన ఒక మహానుభావుడు. NTR అంటే పేరు మాత్రమే కాదు. N అంటే నటన, T అంటే తారమండలం నుండి వచ్చిన ధ్రువ తారకుడు R అంటే రాజశ్రీ, రాజకీయ దురంధుడు, రారాజు. హీరోగా ఎన్నో పాత్రలు చేసి సక్సెస్ అయ్యారు. ఆయనకు అంత సక్సెస్ ఇచ్చిన ప్రజల కోసం ఒక తెలుగుదేశం పార్టీ స్థాపించారు. టాప్ హీరోగా ఉండగానే సినీ పరిశ్రమను వదిలేసి ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని ప్రజల్లోకి వచ్చారు అని తెలిపారు.