Celebrity Divorce: డైవర్స్ అయితేనేం.. కలిసి చిల్లవుతున్న సెలబ్రిటీ కపుల్స్!

జనరల్ గా భార్య భర్తలమధ్య అభిప్రాయ బేధాలుండి.. ఇక అసలు కలిసి ఉండే పరిస్తితి లేనప్పుడు విడాకులు తీసుకుంటారు. ఇక ఒక్కసారి విడాకులు తీసుకున్నాక కలవడాలు ఉండవు.. ఒక వేళ కలిసినా పెద్దగా..

Celebrity Divorce: డైవర్స్ అయితేనేం.. కలిసి చిల్లవుతున్న సెలబ్రిటీ కపుల్స్!

Celebrities Divorce

Celebrity Divroce: జనరల్ గా భార్య భర్తలమధ్య అభిప్రాయ బేధాలుండి.. ఇక అసలు కలిసి ఉండే పరిస్తితి లేనప్పుడు విడాకులు తీసుకుంటారు. ఇక ఒక్కసారి విడాకులు తీసుకున్నాక కలవడాలు ఉండవు.. ఒక వేళ కలిసినా పెద్దగా ఇంటరాక్షన్ ఉండదు. కానీ సినిమా వాళ్ల డివోర్స్ మాత్రం డిఫరెంట్. 10,15 ఏళ్లు కలిసుండి ఇక మా దారులు వేరంటూ డివోర్స్ తీసుకుని మళ్లీ కలిసి షికార్లకు, పార్టీలకు అటెండ్ అవుతూ ఉంటారు. ఈమధ్య బాలీవుడ్ లో ఇలాంటి డివోర్స్ జంటలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

Stars Divorce: ఏళ్ల బంధానికి గుడ్ బై.. మా కొద్దీ పెళ్లిళ్లంటున్న స్టార్స్

సినిమా ఇండస్ట్రీలో ఈమధ్య కొత్త ట్రెండ్ కి తెరతీసున్నారు సెలబ్రిటీలు. ఎంతో ప్రేమించుకుని.. పెళ్లి చేసుకుని.. సంవత్సరాలు సంవత్సరాలు కలిసుండి సడెన్ గా విడిపోతున్నారు. డివోర్స్ తీసుకున్నా.. మళ్లీ పార్టీలకు, పుట్టినరోజులకు కలుస్తూ.. ఫ్రెండ్లీగా కనిపిస్తూ జనాన్ని కన్ ఫ్యూజ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, స్టార్ హీరో ధనుష్ తమ వివాహబందం ముగిసిందని అఫీషియల్ గా సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు.

Celebrities Divorce: విడాకులందు.. సినిమా వాళ్ళ విడాకులు వేరయా!

18 ఏళ్ల తమ మ్యారీడ్ లైఫ్ కి బ్రేకప్ చెప్పి విడాకులు తీసుకున్నారు ధనుష్, ఐశ్వర్య. విడాకులు తీసుకున్నా మామధ్య ఫ్రెండ్లీ రిలేషన్ అలాగే ఉంటుందని చెప్పిన ఈ ఇద్దరూ ఇప్పుడు అదే ఫ్రిండ్ షిప్ ని పబ్లిక్ గానే చూపించుకున్నారు. మొన్నీమధ్య వరకూ రజనీకాంత్ రాయబారంతో ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలుస్తున్నారంటూ న్యూస్ వైరల్ అయ్యింది కానీ క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు. అయితే ఐశ్వర్య చేసిన పయాని అనే మ్యూజిక్ వీడియో రిలీజ్ అయిన సందర్భంగా.. ఈ మ్యూజిక్ వీడియోకి కంగ్రాట్స్ మై డియర్ ఫ్రెండ్.. గాడ్ బ్లెస్ యూ అంటూ ధనుష్ ఐశ్వర్యకి ట్వీట్ చేశాడు. దానికి ఐశ్వర్యా కూడా థాంక్యూ ధనుష్ అంటూ రిప్లై ఇచ్చి ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. అంతేకాదు.. ధనుష్ నుంచి విడిపోయినా.. సోషల్ మీడియాలో హ్యాండిల్స్ కు ఐశ్వర్యాధనుష్ అనే కంటిన్యూ చేస్తోంది ఐశ్వర్య.

Divorce : భార్యను భరించలేను.. విడాకులు ఇప్పించండి – సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

సుస్మితా సేన్.. తన బాయ్ ఫ్రెండ్ రోహ్మన్ షాతో దాదాపు 4,5 ఏళ్ల నుంచి రిలేషన్ లో ఒకే ఇంట్లో కలిసుంటున్నారు. అయతే సడెన్ గా ఓ రోజు మేం విడిపోతున్నాం. కానీ ఫ్రెండ్స్ గా ఎప్పటికీ కలిసుంటాం అంటూ సోషల్ మీడయాలో పోస్ట్ పెట్టారు. ఈ షాక్ నుంచి తేరుకునే లోపే.. రీసెంట్ గా ఈ ఇద్దరు కలిసి కార్ లో బయటికెళ్లారు. అంతేకాదు.. రోహ్మన్ సుస్మితా ఇంటికి వెళ్లి అక్కడ అందరితో టైమ్ స్పెండ్ చేసి బాయ్ చెప్పి మరీ వెళ్లాడు.

Divorce : పాట నచ్చలేదని భార్యకు విడాకులిచ్చిన కొత్త పెళ్లికొడుకు

మరో బాలీవుడ్ బ్రేకప్.. హృతిక్ రోషన్, సుజానే జంటది. దాదాపు 15 ఏళ్ల మ్యారీడ్ లైఫ్ కి ఎండ్ కార్డ్ చెప్పి ఎవరి దారి వారు చూసుకున్నారు ఈ జంట, అయితే పిల్లల కోసం ఎప్పుడూ కలుస్తూనే ఉన్నారు. అంతేకాదు.. విడాకుల తర్వాత.. లాస్ట్ ఇయర్ కోవిడ్ టైమ్ లో సుజానే.. హృతిక్ ఇంట్లోనే ఉండి పిల్లలతో టైమ్ స్పెండ్ చేసింది. అంతే కాదు.. మొన్నీమధ్య హృతిక్ బర్త్ డేకి కూడా సోషల్ మీడియాలో బెస్ట్ డాడ్ ఎవర్.. బిగ్ హగ్ అంటూ.. వీడియో పోస్ట్ చేసింది.

Tollywood Divorce List: కమల్ నుండి చై వరకు.. విడాకులు తీసుకున్న స్టార్స్!

అసలు వీళ్లు నిజంగానే విడాకులు తీసుకున్నారా అని జనానికి డౌట్స్ క్రియేట్ చేసే జంట అమీర్ ఖాన్, కిరణ్ రావ్. ఆల్రెడీ ఓ సారి డివోర్స్ తీసుకుని కిరణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్.. 15 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. మా దారులు వేరు.. అయినా సరే మేం ఎప్పటికీ స్నేహితులు గానీ ఉంటాం అంటూ డివోర్స్ తీసుకన్నారు. షూటింగ్స్ లో డాన్సులు చేస్తూ.. కలిసి షూటింగ్స్ లో సందడి చేస్తూ.. పిల్లల పుట్టినరోజులు కలిసి చేస్తూ.. ఫాన్స్ కి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. అంతే కాదు డివోర్స్ అయిన రెండోరోజే కలసి లైవ్ లో ప్రోగ్రామ్ చేసి మేం చాలా హ్యపీగా ఉన్నాం అంటూ ఫాన్స్ తో వీడియో షేర్ చేసుకున్నారు.

Divorce Party: పెళ్లికి బ్రేకప్..గ్రాండ్‌గా భారతీయ మహిళ విడాకుల పార్టీ

ఈ ఫ్రెండ్లీ డివోర్స్ లిస్ట్ లోకే వస్తారు మలైకా అరోరా, ఆర్బాజ్ ఖాన్. ఈజంట ఏకంగా 20 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆర్బాజ్ జార్జియా ఆండ్రియానీతో రిలేషన్ లో ఉంటే, మలైకా.. యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉంది. త్వరలో వీళ్ల పెళ్లి కూడా జరగబోతోందంటూ న్యూస్ నడుస్తోంది. ఇలా సెపరేట్ గా ఎవరి లైఫ్ లో వాళ్లు బిజీగా ఉన్న మలైకా, ఆర్బాజ్ కొడుకు అర్హాన్ కోసం కలుస్తుంటారు. మలైకా, అర్హాన్, ఆర్బాజ్ ఇలా ముగ్గురూ కలిసి టైమ్ స్పెండ్ చేస్తూ.. జనానికి సర్ ప్రైజ్ ఇస్తూ ఉంటారు.

Bollywood Actress Divorce : భారీగా భ‌ర‌ణం ఇచ్చి విడాకులు తీసుకున్న బాలీవుడ్‌ సెల‌బ్రెటీలు వీళ్లే!

2009లో వచ్చి దేవ్ డి సినిమా సెట్లో ఫస్ట్ టైమ్ కలుసుకున్నారు బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, కల్కి. రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న ఈ జంట.. 4 ఏళ్లతర్వాత 2015లో విడాకులు తీసుకున్నారు. డివోర్స్ తీసుకుంటే వివాహబందం మాత్రమే ముగిసిపోతుంది కానీ.. తమ మధ్య ఫ్రెండ్ షిప్ ఏమాత్రం తగ్గలేదని అప్పుడప్పుడు ఇంటర్య్యూల్లో కనిపిస్తూ.. ఫ్రెండ్ షిప్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు.