Celebrity Kids : బయటి ప్రపంచానికి దూరంగా సెలబ్రిటీ పిల్లలు.. అసలు చూపించరా??

మీడియాకి స్టార్ సెలబ్రిటీస్(Celebrities) కనిపించారంటే పండగే. వరసగా ఫోటోలు, వీడియోలతో ఎక్కడ కనిపిస్తే అక్కడ హడావిడి చేస్తారు. అయితే ఈ అటెన్షన్, మీడియా నుంచి పిల్లల్ని మాత్రం దూరం పెట్టేస్తూ ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు స్టార్లు.

Celebrity Kids : బయటి ప్రపంచానికి దూరంగా సెలబ్రిటీ పిల్లలు.. అసలు చూపించరా??

Celebrity Kids away from camera

Celebrity Kids :  సెలబ్రిటీస్ సినిమాలతో పాటు ఏం చేసినా, ఏం డ్రెస్ వేసుకున్నా, ఏం తిన్నా, ఎక్కడ తిరిగినా ఇలా ప్రతీదీ సెన్సేషనే. ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫోటోలతో హడావిడి చేసేస్తుంది మీడియా(Media). ఈ హడావిడి, ఈ మీడియా ఫోకస్ తమ పిల్లలకు మాత్రం వద్దనుకుంటున్నారు కొంతమంది స్టార్లు. మీడియాకి స్టార్ సెలబ్రిటీస్(Celebrities) కనిపించారంటే పండగే. వరసగా ఫోటోలు, వీడియోలతో ఎక్కడ కనిపిస్తే అక్కడ హడావిడి చేస్తారు. అయితే ఈ అటెన్షన్, మీడియా నుంచి పిల్లల్ని మాత్రం దూరం పెట్టేస్తూ ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు స్టార్లు.

ఈ విషయంలో స్టార్ కపుల్ ఆలియా భట్, రణబీర్ చాలా క్లియర్ గా ఉన్నారు. ఇప్పటి వరకూ మీడియా కంట పడకుండా కూతురు రాహాని సేఫ్ గార్డ్ చేస్తున్నారు. ఫేస్ కనపడకుండా అలియా రాహా ఫోటో ఒకటి మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫోటోల్ని మాత్రం బయటకు రాకూడదని మీడియాని కూడా రిక్వెస్ట్ చేశారు ఈ స్టార్ కపుల్. ప్రజెంట్ పేరెంట్ హుడ్ ని ఎంజాయ్ చేస్తున్న ఆలియా, రణబీర్ కూతురు రాహాని అసలు మీడియా కంటపడకుండా, ఎవరూ చూడకుండా పెంచుదాం అనుకోవట్లేదట. ప్రస్తుతానికి అంత ఎక్స్‌పోజర్ అవసరం లేదని, ఇలా ఎన్నాళ్లు ఉంచుతామన్నది ఇంకా ఏం అనుకోలేదని మాత్రం చెబుతోంది ఆలియా.

రెండేళ్లు నిండి మూడో సంవత్సరం వచ్చినా ఇప్పటి వరకూ ఎక్కడా వాంటెడ్ లీ మీడియా కంటపడకుండా తమ కూతుర్ని సేఫ్ గార్డ్ చేస్తున్నారు కోహ్లి, అనుష్క జంట. ఈ స్టార్ కపుల్ ఫస్ట్ నుంచి వామిక విషయంలో చాలా స్ట్రిక్ట్ రూల్ ఫాలో అవుతున్నారు. ఎన్ని ఫారెన్ ట్రిప్పులేసినా ఎన్ని సార్లు మీడియాకి కనిపించినా పాప ఎక్కడా రివీల్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఓ క్రికెట్ మ్యాచ్ లో వామిక కనిపించడంతో ఈస్టార్ కిడ్ ని చూసి తెగ ఆనందపడిపోయారు ఫాన్స్. కానీ కావాలనే వామికని మీడియాకి మాత్రం దూరంగానే ఉంచుతున్నారు కోహ్లి, అనుష్క జంట. ఇలా ఎన్నాళ్ళు ఉంచుతారో.

సౌత్ లో నయనతార దంపతులు కూడా తమ పిల్లల్ని మీడియా నుంచి దూరం పెడుతున్నారు. ఇప్పటికి చాలా సార్లు సోషల్ మీడియాలో పిల్లలతో పోస్టులు పెట్టినా ఎక్కడా పిల్లల మొహాలు రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు. అంతేకాదు షూట్స్ కోసం ఎయిర్ పోర్ట్ లో కనిపించినా కూడా ఎక్కడా పిల్లలని మీడియాకి కనిపించకుండా దాచేశారు.

Samantha : పర్సనల్ ఫీలింగ్స్ ని యాడ్స్ లో పెట్టిందా?? ఆ విషయంలో సమంతనే ఫస్ట్..

ప్రియాంకా చోప్రా కూడా మొన్నమొన్నటి వరకూ కూతురు మాల్తీని ఎక్కడా చూపించకుండా జాగ్రత్త పడింది. అప్పటి వరకూ కూతురితో ఫోటో షూట్ చేసినా కూడా ఎక్కడా ఫేస్ రివీల్ చెయ్యనివ్వలేదు. నిక్ జోనస్ అవార్డ్ ఫంక్షన్ లో పబ్లిక్ గా మాల్తీని ఇంట్రడ్యూస్ చేసి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది ప్రియాంకా. ప్రియాంకతో పాటు కరీనా, కాజల్ లాంటి స్టార్ హీరోయిన్స్ తమ పిల్లల్ని కొన్నాళ్ళు దాచి మీడియాకి అధికారికంగా పరిచయం చేస్తున్నారు. దాదాపు సంవత్సరం పాటు కాజల్ తన కొడుకు ఫేస్ రివీల్ చేయకుండా ఇటీవలే మొదటి పుట్టిన రోజుకి ఫోటో పోస్ట్ చేసింది. ఇలా స్టార్ సెలబ్రిటీలు తమ చిట్టి చిట్టి పాపాయిలను, బాబులను మీడియా కంటపడకుండా జాగ్రత్త పడుతున్నారు.