Chandoo Mondeti : సూర్య, హృతిక్ రోషన్, నాగచైతన్య సినిమాలు అనౌన్స్.. గీత ఆర్ట్స్‌లో ప్రాజెక్ట్స్!
చందు ముండేటి దర్శకత్వంలో, అల్లు అరవింద్ నిర్మాణంలో సూర్య, హృతిక్ రోషన్, నాగచైతన్య సినిమాలు ఉండబోతున్నాయట. ఆల్రెడీ ఈ మూవీ..

Chandoo Mondeti Allu Aravind movies with suriya krithik roshan naga chaitanya ram charan
Chandoo Mondeti – Allu Aravind : కార్తికేయ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన చందు ముండేటి.. తీసింది 4 సినిమాలే అయిన ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో స్థానం దక్కించుకున్నాడు. గత ఏడాది కార్తికేయ 2 (Karthikeya 2) తో భారీ విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు.. గీతా ఆర్ట్స్ కి ఇచ్చిన కమిట్‌మెంట్ తో ఇప్పటి వరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదు. తాజాగా చందు ముండేటి, అల్లు అరవింద్ ఒక మూవీ ఫంక్షన్ లో పాల్గొనగా.. వారి ప్రాజెక్ట్స్ వివరాలను మీడియాకి తెలియజేశారు.
Ram Charan : గీతా ఆర్ట్స్‌లో 300 కోట్లతో రామ్‌చరణ్ సినిమా.. కన్‌ఫార్మ్ చేసిన దర్శకుడు!
చందు ముండేటి గీతా ఆర్ట్స్ లో మొత్తం మూడు ప్రాజెక్ట్స్ చేయబోతున్నాడట. ప్రస్తుతం రెండు కథలు కంప్లీట్ గా రెడీ అయ్యినట్లు తెలియజేశారు. మరొక ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ తో ఉండబోతుందట. ఇక ఈ సినిమాల్లో హీరోలుగా రామ్ చరణ్ (Ram Charan), సూర్య (Suriya), హృతిక్ రోషన్ (Hrithik Roshan), నాగచైతన్య (Naga Chaitanya) లు నటించబోతున్నారని తెలియజేశారు. ఆల్రెడీ సూర్యని కలిసి ఒక స్టోరీ చెప్పినట్లు, తను కూడా ఒక చెప్పినట్లు చెప్పుకొచ్చాడు. ఇక నాగచైతన్యతో ప్రాజెక్ట్ ఎప్పుడు నుండో అనుకుంటున్నదే.
ఇటీవల కస్టడీ ప్రమోషన్స్ లో చైతన్య కూడా చందు కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పుకొచ్చాడు. ముందుగా ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది. మరి చందు ఎవర్ని ముందుగా డైరెక్ట్ చేస్తాడో చూడాలి. ఇక మొన్నటి వరకు గీతా ఆర్ట్స్.. డబ్బింగ్ సినిమాలకు మాత్రమే పరిమితం అవుతుందని కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు చందు ముండేటితో పాటు బోయపాటితో ఒక సినిమా, సురేందర్ రెడ్డితో ఒక సినిమా అనౌన్స్ చేసి ఆ కామెంట్స్ కి చెక్ పెట్టేశాడు అల్లు అరవింద్. సురేందర్ రెడ్డి, బోయపాటి సినిమాలు కథ చర్చలు జరుగుతున్నాయి చెప్పుకొచ్చాడు.