Chiranjeevi : ప్రాణంతో పోరాడి వచ్చిన పాప.. పూనకాలు లోడింగ్ అంటూ స్టెప్పులు వేస్తుంది.. చిరు రిప్లై!

చిరంజీవి, రవితేజ కలిసి నటించిన మాస్ మసాలా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇక సినిమాలో దేవిశ్రీ ఇచ్చిన క్యాచీ సాంగ్స్ అందర్నీ ఉర్రూతలూగిస్తున్నాయి. తాజాగా ఒక చిన్న పాప థియేటర్ లో పూనకాలు లోడింగ్ సాంగ్ కి డాన్స్ వేస్తున్న వీడియో వైరల్ కావడంతో, అది కాస్త చిరంజీవి దగ్గర వరకు చేరుకుంది. ఇక ఆ వీడియో చూసిన చిరు రిప్లై ఇచ్చాడు.

Chiranjeevi : ప్రాణంతో పోరాడి వచ్చిన పాప.. పూనకాలు లోడింగ్ అంటూ స్టెప్పులు వేస్తుంది.. చిరు రిప్లై!

chiranjeevi poonakalu loading

Chiranjeevi : చిరంజీవి, రవితేజ కలిసి నటించిన మాస్ మసాలా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాలో రవితేజ, చిరంజీవికి తమ్ముడిగా నటించాడు. సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ అందరి చేత కంటతడి పెట్టిస్తున్నాయి. ఇక రీ ఎంట్రీ తరువాత చిరంజీవిలోని మాస్ ని, కామెడీ టైమింగ్ ని మిస్ అవుతున్న అభిమానులకు ఈ సినిమాలో కనిపించడంతో మెగా ఫ్యాన్స్ కి పూనకాలు వస్తున్నాయి. వింటేజ్ చిరుని చూపించడంలో దర్శకుడు బాబీ సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలైట్ అంటున్నారు ప్రేక్షకులు.

Chiranjeevi : మీ బోడి పెర్ఫార్మన్స్ నా దగ్గరొద్దంటూ చిరంజీవి గారు కుర్చీ విసిరేశారు.. డైరెక్టర్ బాబీ!

అలాగే సినిమాలో దేవిశ్రీ ఇచ్చిన క్యాచీ సాంగ్స్ అందర్నీ ఉర్రూతలూగిస్తున్నాయి. తాజాగా ఒక చిన్న పాప థియేటర్ లో పూనకాలు లోడింగ్ సాంగ్ కి డాన్స్ వేస్తున్న వీడియోని ఒక నెటిజెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పుట్టుక తోనే ఒక అరుదైన వ్యాధితో పుట్టింది ఆ పాప. దీంతో ఆ పాపకి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు ఆపరేషన్ అయ్యింది. ప్రాణంతో పోరాడి గెలిచిన ఆ పాప ఇటీవల చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా చూసింది. సినిమాలోని పూనకాలు లోడింగ్ సాంగ్ వచ్చిన సమయంలో ఆ పాప వేసిన స్టెప్పులు అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఆ వీడియో వైరల్ కావడంతో అది కాస్త చిరంజీవి దగ్గర వరకు చేరుకుంది. ఇక ఆ వీడియో చూసిన చిరు రిప్లై ఇచ్చాడు. ‘ఆ పాప పేస్ లో ఎంత ఆనందం. ఇలాంటి చిన్న చిన్న ఫ్యాన్స్ ని కూడా ‘పూనకాలు లోడింగ్’ రాకింగ్ చేయడంతో నెక్ట్స్ జనరేషన్‌కి కూడా ఈ సాంగ్ నచ్చుతుంది అని అర్ధమవుతుంది’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఇదే వీడియోకి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా రియాక్ట్ అయ్యాడు. ‘ఆమెకు మరెంత ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, ప్రేమని కలిగించాలి అని ఆ దేవుడిని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశాడు.