Dulquer Salman: సైకోగా మారిపోయిన సీతారామం హీరో దుల్కర్ సల్మాన్..

సీతారామం హిట్ తో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఫుల్ జోష్ మీద ఉన్నారు. తన తదుపరి చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆర్. బాల్కితో చేస్తున్నాడు. ఈ చిత్రానికి "చుప్" అని టైటిల్ ని ఖరారు చేశారు. ది రివెంజ్ ఆఫ్ ఆర్టిస్ట్ అనేది ట్యాగ్ లైన్.

Dulquer Salman: సైకోగా మారిపోయిన సీతారామం హీరో దుల్కర్ సల్మాన్..

Dulquer Salman plays a Pyscho role

Dulquer Salman: సీతారామం హిట్ తో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఫుల్ జోష్ మీద ఉన్నారు. తన తదుపరి చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆర్. బాల్కితో చేస్తున్నాడు. ఈ చిత్రానికి “చుప్” అని టైటిల్ ని ఖరారు చేశారు. ది రివెంజ్ ఆఫ్ ఆర్టిస్ట్ అనేది ట్యాగ్ లైన్. ఇంట్రస్టింగ్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 5న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తిలిపింది.

Dulquer Salman : హీరో అవుతాను అంటే.. నా పరువు తీయకు, నీ వల్ల కాదు అన్నారు..

అయితే ఈ సినిమా కథాంశం మొత్తం సినిమాల చుట్టూ తిరుగుతుందని, సినిమా చూడకుండా తప్పుడు రివ్యూలు రాసే వారిని దుల్కర్ మర్డర్ చేస్తూ ఉంటాడట. హీరో ఇలా సైకోగా మారడానికి గల కారణాలు ఏంటి? సినిమాలకు అతడికి సంబంధం ఏంటి అనేది మిగిలిన సినిమా కథాంశం అని సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ నేల 23న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

Dulquer Salmaan : మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కి భీమవరంలో భారీ కటౌట్..

ఇక ఈ సినిమాలో దుల్కర్ తో పాటు బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్, పూజా భట్, తెలుగమ్మాయి శ్రేయా ధన్వంతరి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సీతారామంతో మంచి రొమాంటిక్ హిట్ కొట్టి వెంటనే జోనర్ మార్చి సైకో థిల్లర్ గా రాబోతున్న దుల్కర్ సల్మాన్ కు ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందిస్తుందో చూడాలి.