Faria Abdullah: మరోసారి అలాంటి పాత్రలోనే నటిస్తున్నా.. రవితేజతో పోటీ ఖాయమంటోన్న చిట్టి!

జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది అందాల భామ ఫరియా అబ్దుల్లా. తాజాగా మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రావణాసుర’ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది ఫరియా. అయితే ఈ సినిమాలో అమ్మడిది హీరోయిన్ రోల్ కాదని తెలుస్తోంది.

Faria Abdullah: మరోసారి అలాంటి పాత్రలోనే నటిస్తున్నా.. రవితేజతో పోటీ ఖాయమంటోన్న చిట్టి!

Faria Abdullah Role In Raviteja Ravanasura Movie

Faria Abdullah: జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది అందాల భామ ఫరియా అబ్దుల్లా. ఆ సినిమాలో చిట్టి పాత్రలో ఈ అమ్మడు చేసిన పర్ఫార్మెన్స్‌కు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇక లాయర్ పాత్రలో ఈ బ్యూటీ తన నటనతో పాటు కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

Faria Abdullah : ఫరియా అబ్దుల్లా అందాలు చూసి ఆహా అనాల్సిందే..

కాగా, ఆ సినిమా తరువాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది ఈ బ్యూటీ. తాజాగా మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రావణాసుర’ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది ఫరియా. అయితే ఈ సినిమాలో అమ్మడిది హీరోయిన్ రోల్ కాదని తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియజేసింది ఈ చిన్నది. రావణాసుర చిత్రంలో మరోసారి లాయర్ పాత్రలో నటిస్తున్నట్లు ఫరియా చెప్పుకొచ్చింది.

Faria Abdullah : విజయవాడ ప్రమోషన్స్ లో చీరలో మెరిపించిన ఫరియా అబ్దుల్లా

జాతిరత్నాలు తరువాత రావణాసుర మూవీలోనూ లాయర్ పాత్ర రావడంపై అమ్మడు సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో రవితేజ కంటే సీనియర్ లాయర్‌గా ఫరియా కనిపించనుంది. రవితేజతో తనకు టామ్ అండ్ జెర్రీ టైపులో ఓ ఎపిసోడ్ నడుస్తూ ఉంటుందని.. సినిమాలో తమ మధ్య కామెడీ ట్రాక్ ఉంటుందని అది ప్రేక్షకులు బాగా నవ్విస్తుందని ఫరియా పేర్కొంది. మరి ఈ సినిమాలో లాయర్ పాత్రలో ఈ చిట్టి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిందో తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.