Sirivennela : సిరివెన్నెలకి గూగుల్ నివాళి..

ఎంతోమంది ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. ప్రపంచ టెక్ దిగ్గజం, సెర్చ్ ఇంజన్ గూగుల్ కూడా సిరివెన్నెలకి నివాళులు.......

Sirivennela : సిరివెన్నెలకి గూగుల్ నివాళి..

Google

Sirivennela :  తెలుగు సాహిత్యాన్ని పాట రూపంలో సామాన్య ప్రజలకి కూడా అర్థమయ్యేలా చెప్పిన మహాను భావుడు సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. ఆయన అకాల మరణం తెలుగు సినీ సాహిత్యానికి తీరని లోటు. ఇవాళ ఉదయం నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్ లో ఉంచారు. ఇప్పటికే ఎంతో మంది వచ్చి ఆయనకి నివాళులు అర్పించారు. రాలేని ఎంతోమంది ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. ప్రపంచ టెక్ దిగ్గజం, సెర్చ్ ఇంజన్ గూగుల్ కూడా సిరివెన్నెలకి నివాళులు అర్పించింది.

Sirivennela : సిరివెన్నెలకి.. ఆ జిల్లాకి.. విడదీయలేని బంధం

గూగుల్ తన ట్విట్టర్ లో సిరివెన్నెలకు నివాళి అర్పించింది. ” Ok Google, play Sirivennela songs..” అని ట్రెండ్ కి తగ్గట్టు పోస్ట్ చేసి దానితో పాటు ‘సిరివెన్నెల’తో మొదలయిన జీవన గీతం, సీతారామశాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం.. అని గూగుల్ ఇండియా ట్వీట్ చేసింది.