Hanu-Man: ప్రశాంత్ వర్మ హనుమాన్ టీజర్ రిలీజ్‌కు డేట్ లాక్!

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘హనుమాన్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను సూపర్ హీరో మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తుండగా, ఈ సినిమాలో యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్నాడు.

Hanu-Man: ప్రశాంత్ వర్మ హనుమాన్ టీజర్ రిలీజ్‌కు డేట్ లాక్!

Hanu-Man Teaser Release Date Locked

Hanu-Man: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘హనుమాన్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను సూపర్ హీరో మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తుండగా, ఈ సినిమాలో యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.

Hanu-man Teaser: హనుమాన్ టీజర్ అప్డేట్ వచ్చేది ఆరోజే!

కాగా, ఈ సినిమా టీజర్‌ను దసరా కానుకగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించినా, ‘ఆదిపురుష్’ టీజర్ కారణంగా హనుమాన్ టీజర్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఇక ఇటీవల హనుమాన్ టీజర్ రిలీజ్ డేట్‌ను ఇవాళ అనౌన్స్ చేస్తామని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలియజేయడంతో, ఈ సినిమా టీజర్‌ను ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారా అనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ నెలకొంది.

Hanu-Man : ‘అంజనాద్రి’ ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ‘హనుమంతు’..

అయితే తాజాగా హనుమాన్ చిత్ర టీజర్‌ను నవంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోండగా, వినయ్ రాయ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తోండగా, పాన్ ఇండియా మూవీగా హనుమాన్ రానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా టీజర్‌లో అనౌన్స్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.