RRR: జక్కన్న కాకుంటే.. తారక్-చరణ్ ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉండేదో?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తారక్, చెర్రీలతో భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తుంది. మొదటి రోజు భారీ..

RRR: జక్కన్న కాకుంటే.. తారక్-చరణ్ ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉండేదో?

Rrrteam

RRR: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తారక్, చెర్రీలతో భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తుంది. మొదటి రోజు భారీ కలెక్షన్లని సాధించి దూసుకుపోతుంది. సినిమా చూసిన వారంతా రాజమౌళి, చరణ్, తారక్ లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్టీఆర్-రామ్ చరణ్ ఎవరి స్థాయిలో వాళ్ళు ఇరగదీశారని చెప్పకనే చెప్పేస్తున్నారు. కథలో చిన్న చిన్న తప్పులు చెప్పిన విశ్లేషకులు సైతం.. రాజమౌళితో పాటు ఇద్దరు హీరోల కష్టానికి వంకలు పెట్టడం లేదు.

RRR : థియేటర్ వద్ద ఫ్లెక్సీల వివాదం.. ఆందోళన చేస్తున్న అభిమానులు..

అయితే.. ఒకవేళ ఆర్ఆర్ఆర్ సినిమాను రాజమౌళి కాకుండా మరో దర్శకుడు చేసి ఉంటే ఈ ఇద్దరు స్టార్ హీరోల పరిస్థితి ఏంటి అనే చర్చలు కూడా సాగుతున్నాయి. ఎందుకంటే సినిమాలో ఇద్దరికీ సమ ప్రాధాన్యం ఇచ్చినా.. ఇద్దరూ కలిసి అన్నదమ్ముల లాగా ప్రచారం చేసినా.. ఒకరిపై ఒకరు ప్రేమ, స్నేహం చూపించినా.. ఇద్దరి మధ్య ఎలాంటి ఈగోలకు ఆస్కారం లేకపోయినా తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడా అభిమానుల మధ్య గొడవలు కనిపించాయి. పలు చోట్ల థియేటర్లు ధ్వంసం చేశారు. అక్కడక్కడా ఫ్లెక్సీల వివాదాలతో అభిమానులు దాడులకు కూడా దిగారు.

RRR Collections : అమెరికా, ఆస్ట్రేలియాలో కలెక్షన్ల సునామి.. విదేశాల్లో ‘ఆర్ఆర్ఆర్’ హవా..

దీంతో అదే రాజమౌళి కాకుండా మరో దర్శకుడితో ఈ హీరోల సినిమా తీసివుంటే అభిమానుల మధ్య గొడవలు ఇంకా భారీగా ఉండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు హీరోల అభిమానులను.. భారీ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొనే రాజమౌళి ఫస్ట్ నుండి పక్కా ప్లాన్ తో వచ్చాడు. అసలు తారక్-చరణ్ హీరోలుగా పెట్టి సినిమా తీయాలంటే ఎంతో గట్స్ ఉండాలి. ఏ మాత్రం అటు ఇటు అయినా అభిమానుల మధ్య గొడవలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే రాజమౌళి మాత్రం స్టార్ డం పక్కన పెట్టి యాక్టర్స్ గా మాత్రమే చెర్రీ, తారక్ లని తీసుకొని సినిమా చేశానని చెప్పుకొచ్చాడు.

RRR: నైజాంలో రికార్డుల మోత మోగించిన ఆర్ఆర్ఆర్

అంతేకాదు.. నిజంగానే క్లోజ్ ఫ్రెండ్స్ అయిన చెర్రీ-తారక్ ల బంధం గురించి ప్రపంచానికి తెలిసేలా రాజమౌళి సక్సెస్ అయ్యాడు. చెర్రీ, తారక్ లు కలిసి ఇంటర్వ్యూలు ఇస్తూ.. వాళ్ళ బంధాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ.. గిల్లుతూ గిచ్చుతూ వాళ్ళతోనే కామెడీ జనరేట్ చేస్తూ అభిమానులకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చారు. అంత చేస్తేనే సినిమా రిలీజ్ తర్వాత పరిస్థితి ఇలా ఉంది. చరణ్-తారక్ అంటే ఇద్దరు కాదు ఒక్కటే శక్తి అనేలా సంకేతాలిచ్చినా.. స్వయంగా వాళ్ళే అన్నదమ్ములమని ప్రకటించినా అభిమానుల ఆగ్రహం మాత్రం కొన్ని చోట్ల కట్టలు తెచ్చుకుంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో అక్కడక్కడా ఒకరిపై మరొకరి అభిమానుల అటాక్స్ కనిపిస్తున్నాయి. అదే జక్కన్న కాకుండా మరో దర్శకుడితో ఇలాంటి సినిమా అంటే అభిమానులు తన్నుకు చావడం గ్యారంటీ అనిపిస్తుంది.

RRR: బావా.. నువ్వు కుమ్మేశావ్!- అల్లు అర్జున్