నువ్వు అసహ్యంగా ఉన్నావ్ అన్న ట్రోలర్స్‌కి షారూఖ్ ఖాన్ కూతురు గట్టి సమాధానం

  • Published By: sreehari ,Published On : September 30, 2020 / 06:13 PM IST
నువ్వు అసహ్యంగా ఉన్నావ్ అన్న ట్రోలర్స్‌కి షారూఖ్ ఖాన్ కూతురు గట్టి సమాధానం

Suhana Khan: సుహానా ఖాన్‌ అంటే అందరికీ తెలుసు. బాలీవుడ్ సూపర్ shahrukh khan, గౌరీ ఖాన్‌ల కూతురు. కింగ్ ఖాన్ కుమార్తె అయినా తనకూ ట్రోలింగ్స్‌ బెడద తప్పలేదు. తన వంటిరంగుపై కామెంట్లు చేస్తున్న ట్రోలర్స్‌కి ధీటుగా సమాధానమిచ్చారు. సుహానాకు 20 ఏళ్లు. అయితే 12వ ఏట నుంచే, చామనఛాయ రంగువల్లే చాలామంది వివక్ష కామెంట్స్ చేశారని Suhana Khan ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో బైటపెట్టింది.

Suhana Khanలాంటి సూపర్‌స్టార్ కూతురు కలర్ మీదా కామెంట్సా? ఇది వాస్తవం. అందుకే కలరిజమ్‌ను అంతం చేయాలని, ఇదే సరైన సమయమని అన్నారు. ఆమె ఇస్టా‌పోస్ట్ మీద బాధపెట్టే కామెంట్స్ చాలామంది చేశారు. వాటి స్క్రీన్ షాట్స్‌ను సుహానా పోస్ట్ చేసింది.

12 ఏట నుంచి ఆమె రూపం, వంటి రంగు మీద చాలామంది కామెంట్స్ చేసేవాళ్లంట. ఆమె షేర్ చేసిన స్క్రీన్ షాట్‌లో, అందంగా ఉండటానికి కావాల్సిన తెల్లరంగు లేదని కొందరు కామెంట్స్ చేశారు. ఒంకొకడైతే, ఆమె చూడటానికి బాలేదు, దానితోడు నలుపు అంటూ రాశాడు. ఇంకో పోస్ట్‌లో, ఆమె నల్లని మంత్రగత్తెని అన్నాడు. నల్లపిల్లనికూడా ఇంకో పోస్ట్‌లో కామెంట్ చేశారు.

ఈ కామెంట్స్ పెట్టినవాళ్లందరూ ఇండియన్సే. బాగా చదువుకున్నవాళ్లే. చిన్నపిల్లలేంకాదు. సుహానా చెప్పినట్లు ఇండియన్స్ అంతా ఒకటే కదా! మళ్లీ వంటిరంగును బట్టి ఈ కామెంట్స్ ఏంటి? చామన ఛాయ అంటే నల్లగా అందంగా లేనట్లేనా? తెల్లతోలు వుంటేనే అందమా?

Suhana Khanకూడా షారూఖ్ ఖాన్ నుంచి యాక్టింగ్‌ను వారసత్వంగా పుచ్చుకుంది. Englandలోని Ardingly Collegeలో ఫిల్మ్ ను చదువుకుంది.

ఇప్పుడు New York University స్టూడెంట్. Theodore Gimeno డైరెక్ట్ చేసిన The Grey Part Of Blue షార్ట్ ఫిల్మ్‌లో Suhana యాక్ట్ చేసింది.