K Viswanath : కల్ట్ క్లాసిక్స్ ఈ సినిమాలు.. కమర్షియల్స్ తోనే కాదు కళతో కూడా కాసులు కొల్లగొట్టొచ్చు అని చెప్పిన డైరెక్టర్..

ఓ సీత కథ, జీవన జ్యోతి, సిరిసిరి మువ్వ, శంకరాభరణం, సప్తపది, శుభోదయం, శుభలేఖ, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, ఆపద్భాంధవుడు, శుభసంకల్పం, స్వాతికిరణం, స్వరాభిషేకం... ఇలాంటి ఎన్నో క్లాసిక్ సినిమాలని............

K Viswanath : కల్ట్ క్లాసిక్స్ ఈ సినిమాలు.. కమర్షియల్స్ తోనే కాదు కళతో కూడా కాసులు కొల్లగొట్టొచ్చు అని చెప్పిన డైరెక్టర్..

K Viswanath get hist with classic movies

K Viswanath : తెలుగు సినీపరిశ్రమకు ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలని అందించిన కళాతపస్వి కె.విశ్వనాథ్ గురువారం రాత్రి ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ కి తరలిస్తుండగా కన్నుమూశారు. ఆయన మరణంతో మరోసారి టాలీవుడ్ విషాదంలో మునిగింది. ఏ స్టార్ డైరెక్టర్ అయినా భారీ హిట్ కొట్టాలంటే, రికార్డ్ వసూళ్లు తేవాలంటే, రికార్డులు తీయాలంటే కమర్షియల్ సినిమాలతోనే సాధిస్తారు. స్టార్ హీరోలతో, కమర్షియల్ సినిమాతో రికార్డ్స్ కొల్లగొడతారు డైరెక్టర్స్. కానీ కె.విశ్వనాథ్ కి రికార్డులు కొల్లగొట్టడానికి స్టార్ హీరోలు అవసరం లేదు, కమర్షియల్ సినిమాలు అవసరం లేదు. స్లో నేరేషన్ ఉన్నా, సినిమా నిండా పాటలు ఉన్నా, మెలోడీ సినిమా అయినా, సామాజిక అంశాలతోనైనా.. సినిమాలో కమర్షియల్ ఛాయలు లేకుండా కూడా హిట్స్ కొట్టారు. రికార్డులు చూశారు కె.విశ్వనాథ్. అవార్డులు, రివార్డులు సాధించారు.

కె.విశ్వనాథ్ టాలీవుడ్ లో ఒక డైరెక్టర్ మాత్రమే కాదు. తెలుగు సినీ పరిశ్రమకి ఒక లైబ్రరీ. భావి దర్శకులకు ఒక మార్గదర్శి. సినిమా వాళ్లకు ఎన్ని తరాలైనా కరిగిపోని విలువైన జ్ఞాన సంపదని తన సినిమాల రూపంలో ఇచ్చి వెళ్లిపోయారు డైరెక్టర్ కె.విశ్వనాథ్. ఆయన ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యం. ఆయన మొదటి సినిమా ఆత్మగౌరవం నుంచి కూడా ఒక సరికొత్త పంథాని ఎంచుకొని కళ అనేదాన్ని పెంపొందించాలని భావించి సినిమాలు తీశారు.

K Viswanath : వెంటవెంటనే రెండు సార్లు బెస్ట్ డైరెక్టర్ అవార్డులు.. హ్యాట్రిక్ అవార్డులు.. కె.విశ్వనాథ్ అవార్డులు, రివార్డులు..

ఓ సీత కథ, జీవన జ్యోతి, సిరిసిరి మువ్వ, శంకరాభరణం, సప్తపది, శుభోదయం, శుభలేఖ, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, ఆపద్భాంధవుడు, శుభసంకల్పం, స్వాతికిరణం, స్వరాభిషేకం… ఇలాంటి ఎన్నో క్లాసిక్ సినిమాలని తెలుగు వారికి అందించారు కె.విశ్వనాథ్. ఈ సినిమాలన్నీ సంగీతం, సామజిక అంశాలతో కూడుకున్నవే. ఈ సినిమాలన్నిటి పాటలు సూపర్ హిట్ సాంగ్స్. ఇప్పటికి కూడా అవి వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. ఈ ప్రతి సినిమా ఆ సినిమాలో హీరోకి వాళ్ళ కెరీర్ లో ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ గా నిలిచిపోయింది. ఈ సినిమాలన్నీ భారీ విజయాలు సాధించాయి. తోటి డైరెక్టర్స్ కమర్షియల్స్ తో హిట్స్ కొట్టాలని చూసినా సాధ్యం కాని సమయంలో ఈయన ఇలాంటి క్లాసిక్ సినిమాలతో హిట్లు కొట్టారు. ఈయన తలుచుకుంటే ఎవరితో ఎలాంటి సినిమా అయినా తీయొచ్చు. కానీ తన పద్దతికి కట్టుబడి సాంప్రదాయాలు, సంస్కృతి, సంగీతం ప్రాధాన్యంగానే సినిమాలు తీశారు కె.విశ్వనాథ్. కమర్షియల్స్ తోనే కాక కళతో కూడా సినిమాలు తీసి హిట్స్ కొట్టొచ్చు అని నిరూపించిన ఏకైక డైరెక్టర్ కె.విశ్వనాథ్.