అమ్మరాజ్యంలో కడప రెడ్లు : వర్మపై KA పాల్ కోడలు కంప్లయింట్

  • Published By: madhu ,Published On : December 9, 2019 / 01:18 PM IST
అమ్మరాజ్యంలో కడప రెడ్లు : వర్మపై KA పాల్ కోడలు కంప్లయింట్

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చిక్కులు వదలడం లేదు. ఒక చిక్కు తొలగిపోయిందని అనుకున్న క్రమంలో మరో చిక్కు వచ్చి పడుతోంది. ప్రధానంగా ఆయన తెరకెక్కిస్తున్న అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా రచ్చ రచ్చ చేస్తోంది. ఇటీవలే హైకోర్టుకు ఎక్కిన వివాదం ఇటీవలే సమసిపోయింది. చిత్ర రిలీజ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. డిసెంబర్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వర్మ సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఫొటో చిక్కులు తెచ్చి పెట్టింది. వర్మకు..కేఏ పాల్ సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తున్న (మార్ఫింగ్) చేసిన ఫొటో వైరల్ అయ్యింది. 

దీనిపై కేఏ పాల్ సహాయకురాలు జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా 2019, డిసెంబర్ 09వ తేదీ సీసీఎస్ సైబర్ క్రైమ్ కార్యాలయానికి చేరుకున్నారు. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా ప్రమోషన్‌లో భాగంగా..తమ ఫొటోలను మార్ఫింగ్ చేసి వాడుకున్నారని, అభ్యంతకరంగా చూపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో వర్మపై ఐపీసీ 469 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీ అడ్రస్ కోసం సీసీఎస్ పోలీసులు Google సంస్థకు లేఖ రాశారు. మరి వర్మ..ఈ చిక్కు నుంచి ఎలా బయటపడుతారో వెయిట్ అండ్ సీ. 

* కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అన్న టైటిల్ ను నిర్ణయించారు. 
* సినిమా కథనంతోపాటు దీని టైటిల్ ను సవాల్ చేస్తూ..హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. 
* ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కూడా తనను వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఈ చిత్రం ఉందని ఫిర్యాదు చేశారు. 
* సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని, సినిమా విడుదల కాకుండా స్టే విధించాలని హైకోర్టును కోరారు. 
 

* రివైజింగ్ కమిటీ చిత్రాన్ని పూర్తిగా చూసి.. సెన్సార్ చేయాలనీ హైకోర్టు సూచించింది.
* ఈ క్రమంలో అమ్మరాజ్యంలో కడపబిడ్డలుగా అని టైటిల్ మారుస్తున్నట్లు వర్మ ప్రకటించారు. 
* దీంతో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాను రివైజింగ్ కమిటీ చూసింది. 
* కొన్ని కట్స్‌తో U/A సర్టిఫికెట్ ఇచ్చింది. 
* సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. 
* డిసెంబర్ 12న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు వర్మ సోషల్ మీడియాలో ప్రకటించారు. 
* ఈ సినిమా టైటిల్ గురించి, ఇతరత్రా రాజకీయ అంశాల గురించి చర్చలు జరగడం, కేసులు పెట్టడం వంటి పరిణామాలు జరిగాయి.