Indian 2 : హెలికాప్టర్‌ని షేర్ ఆటోలా వాడుతున్న లోకనాయకుడు..

సౌత్ లో మోస్ట్ అవైటెడ్ మూవీలో ఒకటి కమల్ హాసన్ 'ఇండియన్-2'. ప్రెజెంట్ కడపలోని గండికోటలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే కమల్ హాసన్ ఏమో తిరుపతిలో బస చేస్తున్నాడు. అక్కడి నుంచి రోజు గండికోటకు కారులో వస్తే సమయం వృధా అవుతుందని, తిరుపతి నుంచి గండికోటకు ప్రత్యేక హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నాడు.

Indian 2 : హెలికాప్టర్‌ని షేర్ ఆటోలా వాడుతున్న లోకనాయకుడు..

Indian 2 kamal hasan

Indian 2 : సౌత్ లో మోస్ట్ అవైటెడ్ మూవీలో ఒకటి కమల్ హాసన్ ‘ఇండియన్-2’. సూపర్ హిట్ మూవీ భారతీయుడుకి ఇది సీక్వెల్ వస్తుంది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ పేట్రియాటిక్ సినిమా ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఈ మూవీలో కమల్ హాసన్ దేశభక్తితో సొంత కొడుకునే చంపడం అనేది అందరికి విపరీతంగా నచ్చేసింది. ఆ సినిమా ఎండింగ్ లోనే సీక్వెల్ ఉండబోతుంది అంటూ హింట్ ఇచ్చిన దర్శకుడు.. దానిని తెరపైకి తీసుకురావడానికి మాత్రం 20 ఏళ్ళు పట్టింది. 2017 లోనే అనౌన్స్ చేసిన ఈ మూవీ, చిత్రీకరణ విషయంలో చాలా ఇబ్బందులే పడింది.

Indian 2 : గండికోటలో భారతీయుడు.. వైరల్ అవుతున్న షూటింగ్ విజువల్స్..

ప్రస్తుతం అన్ని ఇబ్బందులు దాటుకొని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మొన్నటివరకు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం.. ప్రెజెంట్ కడపలోని గండికోటలో షూటింగ్ జరుపుకుంటుంది. మూవీలోని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు శంకర్. అయితే కమల్ హాసన్ ఏమో తిరుపతిలో బస చేస్తున్నాడు. అక్కడి నుంచి రోజు గండికోటకు కారులో వస్తే సమయం వృధా అవుతుందని, తిరుపతి నుంచి గండికోటకు ప్రత్యేక హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నాడు.

ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా లేటు అవ్వడంతో.. ఇక పై అటువంటిది జరగకుండా లోకనాయకుడు హెలికాప్టర్‌ని షేర్ ఆటోలా వాడుతున్నాడట. ఇక రోజు తిరుపతి నుంచి వెళ్లి వస్తున్న కమల్ ని చూసేందుకు అభిమానులు హెలికాప్టర్‌ దగ్గరికి వస్తున్నారు. ఆ సమయంలో కొందరు అభిమానులు చిత్రీకరించిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ హీరో సుదీప్, తమిళ హీరో సిద్దార్ద్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.