Kangana Ranaut : స్టార్ కమెడియన్ ని టెర్రరిస్ట్ తో పోల్చిన కంగనా

మరోసారి వార్తల్లో నిలిచింది క్వీన్ కంగనా. నార్త్ లో ఫేమస్ కమెడియన్, స్టాండప్ కమెడియన్ విర్ దాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. వెండి తెరతోపాటు బుల్లి తెరపైనా కమెడియన్ గా మంచి పేరు

Kangana Ranaut : స్టార్ కమెడియన్ ని టెర్రరిస్ట్ తో పోల్చిన కంగనా

Kangana

Kangana Ranaut :  కంగనా రనౌత్ బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్. దేశం గురించి, మహిళల గురించి, తన గురించి అయినా ఎవరన్నా తప్పుగా మాట్లాడినా, తక్కువ చేసి మాట్లాడినా కంగనా ఫైర్ అవుతుంది. ఎవరినైనా సరే ఎంతటి వారినైనా సరే తన మాటలతో చెడుగుడు ఆడిస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఒకపక్క అదిరిపోయే సినిమాలు చేస్తూ మరో పక్క సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ దేశంలో జరిగే విషయాలపైన తన రీతిలో స్పందిస్తుంది. ఎన్నో సార్లు ఎంతోమంది పై భయపడకుండా కామెంట్స్ చేసింది. వివాదాల్లో కూడా ఎప్పుడూ ఉంటుంది కంగనా. అయినా అవేమి పట్టించుకోకుండా తన పని తానూ చేసుకెళ్లిపోతుంది.

Mahesh Babu : మహేష్‌బాబు కోసం స్పెషల్ ఫుడ్ పంపిన జెనీలియా

తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది క్వీన్ కంగనా. నార్త్ లో ఫేమస్ కమెడియన్, స్టాండప్ కమెడియన్ విర్ దాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. వెండి తెరతోపాటు బుల్లి తెరపైనా కమెడియన్ గా మంచి పేరు సంపాదించాడు విర్ దాస్. అయితే ఇటీవల అతను వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. తాజాగా ఓ కార్యక్రమంలో విర్ దాస్ “పగటిపూట మహిళల్ని పూజించే దేశంలో.. రాత్రి వేళ్లలో వారిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి“ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

Nayanatara : ప్రియుడితో కలిసి అర్ధరాత్రి బర్త్‌డే వేడుకలు జరుపుకున్న నయన్

ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, భారతీయ మహళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశంలో పుట్టి మహిళల్ని కించపరిచేలా విర్ దాస్ మాట్లాడాడు అంటూ సీరియస్ అయ్యారు. పబ్లిక్ గా క్షమాపణలు చెప్పాలని కొన్ని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. తాజాగా ఈ వివాదానికి కంగనా కూడా తోడైంది. “భారతీయ పురుషులందర్నీ గ్యాంగ్ రేపిస్టులుగా చిత్రీకరిస్తూ విర్ దాస్ మాట్లాడాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులపై జాత్యాహంకారం, బెదిరిపులకు దారితీసేట్టు అతను మాట్లాడాడు. మొత్తం జాతినే లక్ష్యంగా చేసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని సాప్ట్ టెర్రరిస్టులుగా భావించాలి“ అంటూ ఈ క్వీన్ ఫైర్ అయింది.

Puneeth Rajkumar : పునీత్ మరణం తర్వాత సోషల్ మీడియాలో ఫస్ట్ పోస్ట్ పెట్టిన పునీత్ భార్య

అంతేకాకుండా ఇలాంటి నేరస్థులను చట్టబద్ధంగా శిక్షించాలని, నోటికొచ్చినట్లు మాట్లాడిన విర్ దాస్ ని శిక్షించాలని, మళ్లీ భవిష్యత్తులో ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గుణపాఠం చెప్పాలని కంగనా అన్న వ్యాఖ్యలకు మద్దతుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.