Karna Movie Review : ‘కర్ణ’ సినిమా రివ్యూ.. స్నేహితుల కోసం రివేంజ్ స్టోరీ..

నటుడు కళాధర్ కొక్కొండ హీరోగా నటించి దర్శకుడిగా, నిర్మాతగా కూడా తెర‌కెక్కించిన చిత్రం క‌ర్ణ‌.

Karna Movie Review : ‘కర్ణ’ సినిమా రివ్యూ.. స్నేహితుల కోసం రివేంజ్ స్టోరీ..

Karna

Karna Review : నటుడు కళాధర్ కొక్కొండ హీరోగా నటించి దర్శకుడిగా, నిర్మాతగా కూడా తెర‌కెక్కించిన చిత్రం క‌ర్ణ‌. మోనా ఠాకూర్, ఆస్మా సయ్యద్, ఛత్రపతి శేఖర్, అజయ్, దిల్ రమేష్, మహేందర్, ప్రసాద్, నూకరాజు పలువురు ముఖ్య పాత్రల్లో న‌టించారు. కర్ణ సినిమా శుక్రవారం జూన్ 23న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయింది.

కథ విషయానికొస్తే.. కర్ణ(కళాధర్‌ కొక్కొండ) ముగ్గురిని హత్య చేసి జైలు జీవితం గడిపి బయటకు వస్తాడు. అనంతరం స్నేహితులను మోసం చేసిన వారిని టార్గెట్‌ చేస్తూ హత్యలకు పాల్పడుతుంటాడు. ఈ క్రమంలో ఓ మంత్రి కొడుకును కూడా చంపేస్తాడు. దీంతో కర్ణ కోసం పోలీసులు గాలిస్తుంటారు. మరి పోలీసులకు కర్ణ దొరికాడా? అసలు స్నేహితులను మోసం చేసినవారిని మాత్రమే కర్ణ ఎందుకు చంపుతున్నాడు? తన చిన్ననాటి స్నేహితుడు పండు(మహేందర్‌) ఏమయ్యాడు? ప్రేమించిన ఫాతిమాతో తన వివాహం జరిగిందా? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించినట్టు చిత్రయూనిట్ తెలిపారు. స్నేహితులని మోసం చేసిన వాళ్ళని చంపే రివెంజ్ కథ ఇది. రొటీన్ కథే అయినా కొత్తగా చూపించడానికి ట్రై చేశారు. కానీ కొన్ని సన్నివేశాలు రొటీన్ గా ఉంటాయి.

‘చట్టానికి చిక్కిన రవికిరణం, సంకెళ్లతో బిగిసిన ప్రతీకారం.. ద్రోహం, విద్రోహం.. కన్నీళ్లతో రగిలే ఆగ్రహం.. మేధం నరమేధం రక్తంతో రాసిన శాసనం ’అంటూ ట్రైలర్‌లో అదిరిపోయే డైలాగ్స్ ఉండగా సినిమాలో అంతకు మించి ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాలతో పాటు, పల్లెటూరి వాతావరణం, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమాకు ప్లస్ అవుతాయి. కథగా బాగానే ఉన్నా స్క్రీన్ ప్లే అక్కడక్కడా మిస్ అయినట్టు అనిపిస్తుంది.

ఇక నటీనటుల్లో కర్ణ పాత్రకు ‘కళాధర్ కొక్కొండ’ న్యాయం చేశాడు. ఒకవైపు దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలు చేపడుతూ సినిమాలో నటించి, చక్కటి అభినయంతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్‌గా మోనా ఠాకూర్‌ తన పాత్ర పరిధిమేర ఆకట్టుకుంది. ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్, మహేందర్, ప్రసాద్, నూకరాజు, అజయ్, ఎజాస్, ప్రియ, ఆస్మా సయ్యద్ వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

ప్రశాంత్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్‌ అయింది. పాటలు యావరేజ్ గా ఉన్నా BGM పర్వాలేదనిపించింది. కెమెరా వర్క్ కూడా పర్వాలేదనిపిస్తుంది. చిన్న బడ్జెట్ సినిమా కాబట్టి బడ్జెట్ పరిధిలోనే తెరకెక్కించారు సినిమాని. ప్రస్తుతం థియేటర్స్ లో ఈ సినిమా రన్ అవుతుంది.