Balakrishna : హాస్పిటల్‌లో బాలయ్య.. ఆందోళనలో అభిమానులు..

బాలకృష్ణ గత కొన్ని రోజులుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. దీంతో డాక్టర్లు ఆయన మోకాళ్ల నొప్పికి ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ తర్వాత బాలయ్య ఆస్పత్రిలో డాక్టర్స్‌తో............

Balakrishna : హాస్పిటల్‌లో బాలయ్య.. ఆందోళనలో అభిమానులు..

Balakrishna

Balakrishna :  బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు. ఇటీవల ‘అఖండ’ సినిమా భారీ విజయంతో కొత్త ఉత్సాహం రాగా ‘అన్ స్టాపబుల్’ షోతో ఆ ఉత్సాహం మరింత రెట్టింపైంది బాలయ్య బాబుకి. అదే ఊపులో గోపీచంద్ మలినేనితో సినిమా కూడా మొదలు పెట్టేశారు. ఒక పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరో పక్క రాజకీయాల్లో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటున్నారు బాలకృష్ణ. మరో పక్క తన బసవతారకం హాస్పిటల్ పనులు కూడా చూసుకుంటున్నారు. తాజాగా బాలకృష్ణ హాస్పిటల్ లో చేరారు.

Niharika : షార్ట్ హెయిర్, షార్ట్ నిక్కర్‌తో జిమ్‌లో నిహారిక.. పబ్ ఇన్సిడెంట్ తర్వాత ఫస్ట్ టైం బయటకి..

బాలకృష్ణ గత కొన్ని రోజులుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. దీంతో డాక్టర్లు ఆయన మోకాళ్ల నొప్పికి ఆపరేషన్ నిర్వహించారని వార్తలు వస్తున్నాయి. అయితే అదేమీ లేదు బాలకృష్ణ కేవలం జనరల్ చెకప్ కి వెళ్లినట్టు తెలుస్తుంది. మోకాలి నొప్పులు ఉన్న మాట నిజమే కానీ ఆపరేషన్ చేసేంత కాదు అని, చెక్ చేసి మోకాలికి పట్టి వేశారని, మెడిసిన్స్ ఇచ్చారని డాక్టర్స్ తెలిపారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా బాగుందని, కొన్ని రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని, కంగారు పడాల్సిందేమి లేదని తెలిపారు. దీంతో బాలయ్య అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అయితే బాలకృష్ణ రెస్ట్ తీసుకోవాల్సి రావడంతో గోపీచంద్ మలినేనితో జరుగుతున్న సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇవ్వకుండా బాలకృష్ణ లేని సీన్స్ తీస్తున్నట్టు సమాచారం.