Maa Neella Tank: ఆకట్టుకుంటున్న మా నీళ్ల ట్యాంక్ టీజర్.. ఇది ఒరిజినల్!

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ZEE5 ప్రేక్షకులకు అద్భుతమైన వెబ్ సిరీస్‌లను అందిస్తూ వారిని అలరించడంలో సక్సెస్ అవుతూ వస్తోంది. ఇప్పటికే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్....

Maa Neella Tank: ఆకట్టుకుంటున్న మా నీళ్ల ట్యాంక్ టీజర్.. ఇది ఒరిజినల్!

Maa Neella Tank Teaser Impressive

Maa Neella Tank: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ZEE5 ప్రేక్షకులకు అద్భుతమైన వెబ్ సిరీస్‌లను అందిస్తూ వారిని అలరించడంలో సక్సెస్ అవుతూ వస్తోంది. ఇప్పటికే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి వచ్చిన కామెడీ డ్రామా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, అన్నపూర్ణ స్టూడియోస్ స్టేబుల్ నుండి వచ్చిన ‘లూజర్ 2’, BBC స్టూడియోస్ మరియు నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నుండి వచ్చిన ‘గాలివాన’ ఓటీటీ ఆడియెన్స్‌ను కట్టిపడేశాయి. ఇక రీసెంట్‌గా వచ్చిన ‘రెక్కీ’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

కాగా.. ఇప్పుడు తాజాగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో యంగ్ హీరో సుశాంత్ నటిస్తున్న ‘మా నీళ్ల ట్యాంక్’ అనే వెబ్ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేసేందుకు జీ5 రెడీ అయ్యింది. ఈ వెబ్ సిరీస్ ఒక చిన్న పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ అని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. ప్యూర్ రొమాంటిక్ కామెడీతో రాబోతున్న ‘మా నీళ్ల ట్యాంక్’ వెబ్ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను తాజాగా రిలీజ్ చేసింది జీ5. ఇక ఈ వెబ్ సిరీస్‌లో దాదాపు పదేళ్ల తరువాత అందాల భామ ప్రియా ఆనంద్ మళ్లీ కనిపిస్తుండటం విశేషం. కాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ లాంఛ్ సందర్భంగా దర్శకురాలు లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ.. ‘మా నీళ్ల ట్యాంక్ 8-ఎపిసోడ్‌లు కలిగిన వెబ్ సిరీస్. ఒక ఫీల్ గుడ్ పల్లెటూరి కథ. బుచ్చివోలు అనే గ్రామం నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ఉత్తేజకరమైన విధంగా సాగుతుంది. ఆ గ్రామ ఎమ్మెల్యే కొడుకు తాను ప్రేమించిన అమ్మాయి తిరిగి రాకపోవడంతో, ఓ పనికిరాని వాటర్ ట్యాంక్‌లో దూకుతానని బెదిరిస్తాడు. అప్పుడు జరిగే సంఘటనలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని దర్శకురాలు తెలిపింది.

ఇక ఈ వెబ్ సిరీస్‌లో సుశాంత్‌తో పాటు ప్రియా ఆనంద్, సుదర్శన్, ప్రేమ్ సాగర్, నిరోషా, రామరాజు, దివి, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు సునీల్ కశ్యప్ సంగీతం అందించగా, ప్రవీణ్ కొల్లా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను జూలై 15న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు జీ5 ప్రకటించింది.