మంచు విష్ణు మానసికంగా వేధిస్తున్నాడు : ఓటర్ డైరెక్టర్

సినిమా పూర్తి చెయ్యడానికి చాలా మానసిక క్షోభ అనుభవించాను. ఇన్ని ఇబ్బందుల మధ్య సినిమాని రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారు.. నాకు న్యాయం జరగాలి.. అంటూ తన గోడు వెల్లబోసుకున్నాడు కార్తీక్ రెడ్డి..

  • Published By: sekhar ,Published On : May 2, 2019 / 06:19 AM IST
మంచు విష్ణు మానసికంగా వేధిస్తున్నాడు : ఓటర్ డైరెక్టర్

సినిమా పూర్తి చెయ్యడానికి చాలా మానసిక క్షోభ అనుభవించాను. ఇన్ని ఇబ్బందుల మధ్య సినిమాని రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారు.. నాకు న్యాయం జరగాలి.. అంటూ తన గోడు వెల్లబోసుకున్నాడు కార్తీక్ రెడ్డి..

మంచు విష్ణు తనను మానసికంగా వేధిస్తున్నాడని దర్శకుడు కార్తీక్ రెడ్డి ఆరోపణలు చెయ్యడం సినీ పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కార్తీక్ రెడ్డి, సుశాంత్ హీరోగా నటించిన ‘అడ్డా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. గతకొద్ది కాలంగా మంచు విష్ణుతో ‘ఓటర్’ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. త్వరలో సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తుండగా, ఇంతలో డైరెక్టర్, విష్ణుపై సంచలన ఆరోపణలు చేసాడు. అసలేం జరిగిందంటే.. తాను రాసుకున్న ఓటర్ కథకీ, మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ సినిమాకి ఏమాత్రం సంబంధం లేకపోయినా, అసెంబ్లీ రౌడీని ఓటర్ పేరుతో అడాప్ట్ చెయ్యడానికి, విష్ణు, విజయ్ కుమార్ రెడ్డి కలిసి తనతో బలవంతంగా అగ్రిమెంట్ చేయించుకున్నారని కార్తీక్ రెడ్డి చెప్తున్నాడు.
Also Read : వర్మ పంతం నెగ్గింది: ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలైంది.. కానీ!

మొదట తను ‘పవర్ ఫుల్’ అనే కథ రాసుకుని, రైటర్ అసోషియేషన్‌లో రిజిస్టర్ చేయించాక, విష్టుకి కథ చెప్తే, నచ్చి సినిమా చెయ్యడానికి ముందుకొచ్చాడు.. తర్వాత సినిమా టైటిల్‌ని ఓటర్‌గా మార్చాల్సి వచ్చింది. షూటింగ్ టైమ్‌లో రెండు సీన్లు మార్చమని విష్ణు ఒత్తిడి చేసాడు.. సినిమా నిర్మాణంలో ఫ్రీడమ్ ఇవ్వకుండా, ప్రతీ పనిలో ఇన్ వాల్వ్ అయ్యేవాడు, దీంతో బడ్జెట్ పెరిగిపోయింది.

సినిమా పూర్తయ్యాక సినిమా చూసి, సినిమా బాగా రావడంతో కథ, స్క్రీన్‌ప్లే క్రెడిట్స్ తనకివ్వాలని అడిగాడు, నేను ఒప్పుకోలేదు. బెదిరించాడు.. ఆ బాధ భరించలేకే స్క్రీన్‌ప్లే రైటర్‌గా అతని పేరు వేసాను. సినిమా పూర్తి చెయ్యడానికి చాలా మానసిక క్షోభ అనుభవించాను. ఇన్ని ఇబ్బందుల మధ్య సినిమాని రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారు.. నాకు న్యాయం జరగాలి.. అంటూ తన గోడు వెల్లబోసుకున్నాడు కార్తీక్ రెడ్డి.

వాచ్ ఓటర్ టీజర్..