Manchu vishnu : జూబ్లీహిల్స్ ట్రాఫిక్ డైవర్షన్ పై మంచు విష్ణు ట్వీట్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు..
తాజాగా ఈ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ డైవర్షన్ పై నటుడు మంచు విష్ణు ట్వీట్ చేశాడు. విష్ణు తన ట్వీట్ లో.. ''హైదరాబాద్ పోలీసులకు నా అభినందనలు. జూబ్లీ హిల్స్ అంతటా ప్రత్యేకమైన..................

Manchu vishnu : హైదరాబాద్ లో ఇటీవల ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువవుతుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో ఏ సమయంలో చూసినా ట్రాఫిక్ ఉంటుంది. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొన్ని సంస్కరణలు చేపట్టారు. కొన్ని దార్లు మూసేసి, కొన్ని యూ టర్న్స్ బ్లాక్ చేసి, కొన్ని రూట్స్ మార్చి ట్రాఫిక్ ని డైవర్ట్ చేస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ పూర్తిగా తగ్గకపోయినా గతంతో పోలిస్తే కొంచెం తగ్గింది. కానీ యూ టర్న్స్ బ్లాక్ చేసి ప్రయాణించే దూరం చాలా పెరగడంతో ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి.
కొంచెం దూరానికి కూడా జూబ్లీహిల్స్ చుట్టూ వాహనదారులు ప్రదక్షణలు చేయాల్సి వస్తుందని ప్రజలు భావిస్తున్నారు. దీనిపై సాధారణ ప్రజలు విమర్శలు కూడా చేశారు. తాజాగా ఈ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ డైవర్షన్ పై నటుడు మంచు విష్ణు ట్వీట్ చేశాడు. విష్ణు తన ట్వీట్ లో.. ”హైదరాబాద్ పోలీసులకు నా అభినందనలు. జూబ్లీ హిల్స్ అంతటా ప్రత్యేకమైన ట్రాఫిక్ వ్యవస్థను రూపొందించినందుకు. దీనివల్ల నా ఇంటి నుండి ఆఫీసుకి ప్రయాణ సమయం సాయంత్రం పూట 20 నిమిషాలు తగ్గింది. ముఖ్యంగా కమిషనర్ సివి ఆనంద్ గారికి ధన్యవాదాలు. ఇది మంచి ఆలోచన” అని పోస్ట్ చేసి హైదరాబాద్ పోలీసులకి ట్యాగ్ చేశారు.
Revanth : తండ్రైన సింగర్ రేవంత్.. కానీ పాపని చూడలేకపోతున్నాడు..
అయితే మంచు విష్ణు ట్వీట్ పై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కొంతమంది నెటిజన్లు అవును ట్రాఫిక్ తగ్గింది అంటుంటే, మరికొంతమంది ప్రయాణించాల్సిన దూరం పెరిగింది, వేరే చోట్ల ఇంకా చాలా ట్రాఫిక్ ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొంతమంది ఎప్పటిలాగే మంచు విష్ణుని ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
Kudos to the Hyderabad police @hydcitypolice for creating a unique traffic system across jubilee hills. My travel time from home to office has reduced by 20 mins in the evening. Thank you Commissioner CV Anand garu, @CPHydCity brilliant move. ??✊?
— Vishnu Manchu (@iVishnuManchu) December 1, 2022
This is not correct. From Jubilee Check post to Madhapur I used to travel within 10-15 min. Now it is taking 25-30 min.
— Anand Goud (@AnandGo44688275) December 1, 2022
Bro , oka sari hitech city to Ramoji film via old city travel cheyu…hyd traffic reality telustundi.. jubilee hills traffic travel time tagindi ani chinna pillalu school to home early ga reach ainaattu excite avtunav..enti Ginna bro
— Niranjan (@meka_niranjan) December 1, 2022
Good ,better flow of Traffic .
This one way system reminds me of Kolkata , which keeps the Traffic moving .— Amrita Upadhaya Mishra (@amritam9) December 1, 2022