Sai Rajesh : సినిమా రిలీజ్ కాకముందే డైరెక్టర్ కి కార్ గిఫ్ట్ ఇచ్చిన మారుతి..

సినిమా హిట్ అయితే, బాగా డబ్బులొస్తే డైరెక్టర్ లేదా హీరోకి నిర్మాతలు గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. కార్లు, వాచ్‌లు, గోల్డ్ లాంటి కాస్ట్‌లీ గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు. కానీ కొన్ని సార్లు సినిమా రిలీజ్ కాకముందే హిట్ అవుతుందన్న నమ్మకంతో..........

Sai Rajesh : సినిమా రిలీజ్ కాకముందే డైరెక్టర్ కి కార్ గిఫ్ట్ ఇచ్చిన మారుతి..

Maruthi gifted 20 lacks car to director sai rajesh before movie release

Sai Rajesh :  సినిమా హిట్ అయితే, బాగా డబ్బులొస్తే డైరెక్టర్ లేదా హీరోకి నిర్మాతలు గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. కార్లు, వాచ్‌లు, గోల్డ్ లాంటి కాస్ట్‌లీ గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు. కానీ కొన్ని సార్లు సినిమా రిలీజ్ కాకముందే హిట్ అవుతుందన్న నమ్మకంతో డైరెక్టర్స్‌కి గిఫ్ట్స్ ఇస్తున్నారు. ఇటీవల పలువురు నిర్మాతలు ఇలాగే సినిమా రిలీజ్‌కి ముందుగానే గిఫ్ట్స్ ఇస్తున్నారు. తాజాగా ఓ డైరెక్టర్‌కి దర్శకుడు మారుతి కూడా అలాగే కార్‌ని గిఫ్ట్ గా ఇచ్చారు.

కలర్ ఫోటో నిర్మాత, హృదయకాలేయం, కొబ్బరిమట్ట సినిమాల దర్శకుడు సాయి రాజేష్ ప్రస్తుతం బేబీ అనే ఓ సినిమా చేస్తున్నాడు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఈ సినిమాని SKN, దర్శకుడు మారుతి కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫుల్ రష్ చూసి నిర్మాతలు డైరెక్టర్ సాయి రాజేష్ కి 20 లక్షల విలువైన MG హెక్టార్ కారుని బహుమతిగా ఇచ్చారు.

Chiranjeevi : ఎన్టీఆర్,సావిత్రి ఎలాగో నేను, నయనతార కూడా అంతే.. అందుకే ఇలా..

దర్శకుడు సాయి రాజేష్ ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ”బాగా తీశాననే ఇష్టమో లేదా హిట్‌ కొట్టాల్సిందేనని బ్లాక్‌ మెయిలో తెలియదు కానీ మా నిర్మాతలు కారుని బహుమతిగా అందించారు. గురువుగారు మారుతికి, స్నేహితుడు SKNలకు థ్యాంక్స్‌. బేబీ టీజర్‌ త్వరలోనే విడుదల చేస్తాం. మీ అందరి సపోర్ట్‌ ఇలాగే కొనసాగాలి” అని పోస్ట్ చేశాడు. మరి బేబీ సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.