Mega Fans : వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ పై హర్ట్ అయిన మెగా ఫ్యాన్స్.. హైదరాబాద్ లో మెగా ఫ్యాన్స్ సమావేశం..

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో, బాలకృష్ణ వీరసింహా రెడ్డి సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి టాలీవుడ్ స్టార్ల మధ్య చాలా రోజుల తర్వాత పోటీ వస్తుండటంతో ఈ సారి మరింత సందడి నెలకొంది. ఇప్పటికే రెండు సినిమా టీంలు........

Mega Fans : వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ పై హర్ట్ అయిన మెగా ఫ్యాన్స్.. హైదరాబాద్ లో మెగా ఫ్యాన్స్ సమావేశం..

Mega Fans special meet in Hyderabad

Mega Fans :  ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో, బాలకృష్ణ వీరసింహా రెడ్డి సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి టాలీవుడ్ స్టార్ల మధ్య చాలా రోజుల తర్వాత పోటీ వస్తుండటంతో ఈ సారి మరింత సందడి నెలకొంది. ఇప్పటికే రెండు సినిమా టీంలు సాంగ్స్, గ్లింప్స్ వదులుతూ ప్రమోషన్స్ ని విపరీతంగా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలని ఒకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం.

 

ఇటీవల బాలయ్య సినిమా నుంచి ఓ స్పెషల్ సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. అంతకుముందు కూడా టైటిల్ గ్రాండ్ గా కర్నూలు లో రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ లో పోలిస్తే వాల్తేరు వీరయ్య కంటే వీరసింహ రెడ్డి సినిమా ఒక అడుగు ముందే ఉంది. వీరసింహ రెడ్డి ప్రతి దాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తూ అభిమానులకి జోష్ ఇస్తున్నారు. వాల్తేరు వీరయ్య నుంచి మాత్రం సింపుల్ గా ఒక అప్డేట్ ఇచ్చి రిలీజ్ చేసేస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.

Dhamaka Review : మాస్ హిలేరియస్.. ధమాకా రివ్యూ..

వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో మెగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ బేగంపేట హరిత ప్లాజా లో మెగా ఫ్యాన్స్ సమావేశం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి కూడా మెగా ఫ్యాన్స్ ఈ సమావేశానికి వచ్చారు. వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ గురించి చర్చించారు ఈ సమావేశంలో. చిరంజీవితో, చిత్ర యూనిట్ తో ప్రమోషన్స్ గురించి చర్చించాలని, వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ ని మరింత గ్రాండ్ గా చేయాలని డిసైడ్ అయ్యారు.