Sai Dharam Tej : కోలుకుంటున్న సాయిధరమ్ తేజ్‌

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ కోలుకుంటున్నారు. క్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతుండటంతో నిన్న సాయంత్రం తేజ్‌కు వైద్యులు వెంటిలెటర్‌ తొలగించారు. ఇంకా ఐసీయూలోనే తేజ్‌కు చికిత్స కొనసాగుతోంది.

10TV Telugu News

Sai Dharam Tej’s health : మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ కోలుకుంటున్నారు. క్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతుండటంతో నిన్న సాయంత్రం తేజ్‌కు వైద్యులు వెంటిలెటర్‌ తొలగించారు. ప్రస్తుతం ఇంకా ఐసీయూలోనే తేజ్‌కు చికిత్స కొనసాగుతోంది. అప్పుడప్పుడు స్పృహలోకి వస్తున్నట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం అపోలో హాస్పిటల్‌ లోని సెకండ్ ఫ్లోర్‌లో ట్రిట్‌మెంట్‌ కొనసాగుతోంది.. ప్రస్తుతం అతని దగ్గరికి ఎవ్వరిని అనుమతించడం లేదు వైద్యులు.. డాక్టర్‌ అలోక్‌ రంజన్‌ నేతృత్వంలోని వైద్య బృందం తేజ్‌కు చికిత్స అందిస్తున్నారు..

ఇప్పటికే చేసిన కాలర్ బోన్ సర్జరీ కూడా సక్సెస్ కావడం.. వెంటిలేటర్‌ సాయం కూడా అవసరం లేకపోవడంతో త్వరలోనే సాయి ధరమ్‌ తేజ్‌ను డిశ్చార్జ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సాయి ధరమ్‌ తేజ్ వైద్యుల అబ్జర్వేషన్‌లోనే ఉన్నారు. మరో రెండ్రోజుల పాటు ఆయన్ను క్లోజ్‌గా మానిటర్ చేయనున్నారు డాక్టర్లు. సాయిధరమ్‌ తేజ్‌ శరీరం లోపల ఎలాంటి గాయాలు లేవని వైద్యులు నిర్ధారించారు. ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌లో కూడా అంతా నార్మల్‌గా ఉందని వైద్యులు తెలిపారు. తేజ్ చికిత్సకు సహకరిస్తున్నారని చెప్పారు.

Sai Dharam Tej : హీరో సాయి ధరమ్‌ తేజ్‌కు కాలర్ బోన్ సర్జరీ

ఈ నెల 10న సాయిధరమ్‌ తేజ్‌ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో బైక్ పై స్కిడ్ అయి కింద పడ్డాడు. ప్రమాదానికి అతివేగం, నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్థారించారు. బైక్ ప్రమాదంపై విచారణ జరుపుతున్నారు.

10TV Telugu News