Acharya : మెగాస్టార్ ఫ్యాన్స్‌‌కు బ్యాడ్ న్యూస్.. ‘ఆచార్య’ విడుదల వాయిదా

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా కూడా అందులో ఒకటి. ఫిబ్రవరి 04వ తేదీన విడుదల అవుతుందని తొలుత నిర్మాతలు ప్రకటించారు. కానీ...

10TV Telugu News

Megastar Chiranjeevi Film Acharya : మెగాస్టార్ ఫ్యాన్స్ కు సంక్రాంతి పండుగ రోజున బ్యాడ్ న్యూస్ వినిపించింది. చిరంజీవి సినిమా ఎప్పుడు విడుదలువుతుందా ? అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న అభిమానులు మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ఎందుకంటే కరోనా ఉధృతి ఏ స్థాయిలో విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ దిక్కుమాలిన వైరస్ తో పాటు కొత్త వేరియంట్ అందర్నీ భయకంపితులను చేస్తోంది. వేలాది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పెద్ద పెద్ద సినిమాల విడుదల ఆగిపోతున్నాయి.

Read More : Unstoppable with NBK : మా నాన్న, పూరి జగన్నాధ్ కలిసి పని చేసారు : విజయ్ దేవరకొండ

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా కూడా అందులో ఒకటి. ఫిబ్రవరి 04వ తేదీన విడుదల అవుతుందని తొలుత నిర్మాతలు ప్రకటించారు. కానీ…2022, జనవరి 15వ తేదీ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు కొణిదెల ప్రొ కంపెనీ ట్వీట్ చేసింది. కోవిడ్ కారణంగా ఆచార్య సినిమా పోస్ట్ పోన్డ్ చేస్తున్నట్లు, త్వరలోనే సినిమా ఎప్పుడు విడుదల చేసేది ప్రకటిస్తామని పేర్కొంది.

Read More : Free Cycles: ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసిన కంపెనీ హెడ్

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఫిబ్రవరిలో ఈ సినిమాని విడుదల చేయనున్నారని ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ సినిమా నుంచి వరుసగా టీజర్, ఒక్కో సాంగ్ ని విడుదల చేస్తున్నారు. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా అనంతరం ‘లూసిఫర్’ చిత్రంలో నటించనున్నారు మెగాస్టార్. తాజాగా..మరో దర్శకుడి చిత్రానికి ఒకే చెప్పారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమెక్ కు సంబంధించిన అప్ డేట్ ప్రకటించారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ జరుగనుంది.

    ×