Chiranjeevi: మెగా లైనప్.. చిరుత లాంటి చిరు దూకుడు! Megastar Chiranjeevi speed with mega new movies lineup

Chiranjeevi: మెగా లైనప్.. చిరుత లాంటి చిరు దూకుడు!

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచన... జనరల్ గా ఇండస్ట్రీలో హీరోయిన్స్ విషయంలోనే కనిపిస్తుంది.

Chiranjeevi: మెగా లైనప్.. చిరుత లాంటి చిరు దూకుడు!

Chiranjeevi: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచన… జనరల్ గా ఇండస్ట్రీలో హీరోయిన్స్ విషయంలోనే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ సామెతను నిజం చేసే పనిలో స్టార్ హీరోలు క్యూకడుతున్నారు. స్టార్ డం ఉన్నప్పుడే చకచకా సినిమాలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ లిస్ట్ లో ఫస్ట్ పేరు ఎవరిదంటే మెగాస్టార్ దే మరి. దానికీ ఓ లెక్కుంది మరి.

Pushpa 2: ఫస్ట్ పార్ట్ ఇచ్చిన సక్సెస్.. పుష్ప-2పై భారీ అంచనాలు!

152 నుంచి 158 సినిమాల పనులతో ఫుల్ బిజీగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు మెగాస్టార్. ఇన్ని సినిమాలను ఒకేసారి లైన్లో పెట్టడానికి ఓ మెగా రీజన్ ఉందంటున్నారు. వచ్చే ఆగస్టు నాటికి 67 క్రాస్ చేస్తారు చిరూ. కానీ ఇప్పటికీ మెగాస్టార్ మార్కెట్ చాలా స్ట్రాంగ్. దానికి తగ్గట్టే 50కోట్ల రెమ్యునరేషన్ డిమాండే చేసే స్టేజ్ లో ఉన్నారు. అందుకే ఎన్ని సినిమాలకు సైన్ చేస్తే అంత లాభం అన్నట్టు యంగ్ హీరోలకు షాకిస్తూ దూసుకుపోతున్నారు.

Naga Shaurya: ఒక్క హిట్ ప్లీజ్.. బ్రేక్ కోసం నాగశౌర్య ఫీట్స్

చిరుత లాంటి చిరూ దూకుడు కెరీర్ స్టార్టింగ్ లో బాగా కనిపించింది. ఏడాదిలో 14 సినిమాలు విడుదలైన సందర్భాలు ఉన్నాయి మెగాస్టార్ కెరీర్ లో. కానీ మెగా స్టార్‌ వయా సుప్రీం స్టార్ గా ఎదగడంతో సంవత్సరానికి ఒకటి, రెండు సినిమాలను మాత్రమే ఫ్యాన్స్ ముందుంచుతున్నారు. ఇక 2008 నుంచి 2017 మధ్య దాదాపు 9 ఏళ్ల పాటూ పాలిటిక్స్ కారణంగా సినిమా ఊసెత్తలేదు. కానీ ఇప్పుడు కథ మారింది… మనం ఆలోచిస్తుంటే టైమ్ ఆగదు, ఏజ్ తగ్గదు.. సో వీలైనన్ని కమర్షియల్ సినిమాలు చేయాలనేది చిరూ ప్లాన్.

Prabhas: ప్రభాస్ జాతర.. డేట్స్ కోసం వెంటపడుతున్న ప్రొడ్యూసర్స్!

భారీ బడ్జెట్ అవసరం లేదు… ఫారెన్ రిచ్ లోకేషన్స్ లో పని లేకుండా… పక్కా మాస్.. పక్కా కమర్షియల్ సినిమాలకే ఓటేస్తున్నారు చిరంజీవి. సీనియర్ హీరోలెవ్వరికీ లేని లైనప్ చిరూ వెనుక కనిపిస్తుందిప్పుడు. కొవిడ్ తో సినిమాలు వాయిదా పడుతున్నా చిరూ మాత్రం లైనప్ పెంచేస్తున్నారు. చరణ్ తో చేసిన ఆచార్య రిలీడ్ కి రెడీ అయింది. ఆపై 153వ సినిమాగా గాడ్ ఫాదర్, 154వ సినిమాగా భోళాశంకర్, బాబీ డైరెక్షన్లో రవితేజ కాంబోలో 155వ సినిమా, వెంకీ కుడుముల – డివివి దానయ్య కాంబినేషన్లో 156వ సినిమాను లైన్లో పెట్టారు.

Sid Sriram: ఎక్కడ విన్నా సిద్ పాటే.. ఒక్కో పాటకి ఎంత తీసుకుంటాడో తెలుసా?

ఇన్ని సినిమాలను క్యూలో పెట్టిన చిరూ… 157, 158 సినిమాలకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. మారుతి డైరెక్షన్లో మెగా 157, అనిల్ రావిపూడి కాంబోలో మెగా 158 ప్రాజెక్ట్స్ ఉంటాయనే టాక్ ఊపందుకుంది. వీటికి సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుట్టున్న చిరూ.. తాను చేస్తున్న పనిలో మరికొంతమందిని ఇన్ స్పైర్ చేస్తున్నారు.

×