Mohan Babu : 100 కోట్లతో సినిమా నిర్మిస్తున్నా.. రజినీకాంత్ గురించి మాట్లాడాలంటే.. మోహన్ బాబు కామెంట్స్!
తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న మోహన్ బాబు.. 100 కోట్లతో సినిమా చేయబోతున్నట్లు, రజినీకాంత్ గురించి మాట్లాడాలంటే.. అంటూ వైరల్ కామెంట్స్ చేశాడు.

Mohan Babu comments on Rajinikanth and his upcoming project
Mohan Babu – Rajinikanth : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. చివరిగా సన్ ఆఫ్ ఇండియా (Son Of India) మూవీలో మెయిన్ లీడ్ లో కనిపించిన మోహన్ బాబు.. ఇటీవల సమంత శాకుంతలం (Shaakuntalam) సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించి అలరించాడు. తాజాగా ఈ సీనియర్ హీరో తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈరోజు (జూన్ 1) ఉదయం స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నాడు. అనంతరం ఆలయం వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మోహన్ బాబు తన సినిమా విషయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
త్వరలోనే 100 కోట్ల బడ్జెట్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన విషయాలని విష్ణు (Manchu Vishnu) తెలియజేస్తాడని, అప్పటి వరకు తాను కూడా ఏమి చెప్పానని తెలియజేశాడు. ఇక ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో మోహన్ బాబు మెయిన్ లీడ్ లో ‘రావణ బ్రహ్మ’ అనే చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ అది ఎందుకో పట్టాలు ఎక్కలేదు. ఆ తరువాత మంచి విష్ణుతో తనికెళ్ళ భరణి దర్శకత్వంలో ‘భక్త కన్నప్ప’ చేయాలనుకున్నారు. కానీ అది కూడా చర్చలు వరకే ఉండిపోయింది.ఇప్పుడు మోహన్ బాబు 100 కోట్ల బడ్జెట్ మూవీ అంటే.. ఆ రెండిటిలో ఏదొక చిత్రాన్ని పట్టాలు ఎక్కించబోతున్నారా? అని ప్రశ్నలు మొదలు అవుతున్నాయి.
ఇది ఇలా ఉంటే.. ఇటీవల రజినీకాంత్ (Rajinikanth) ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో చేసిన కామెంట్స్ ఏపీలో సంచలనం అయ్యిన విషయం తెలిసిందే. ఇక ఆ కామెంట్స్ గురించి మోహన్ బాబుని ప్రశ్నించగా.. “రజినీకాంత్ వ్యవహరం పై మాట్లాడాలి అంటే సాయంత్రం వరకు సమయం సరిపోదు. ప్రస్తుతం నేను వివాదాల జోలికి వెళ్ళదల్చుకోలేదు” అంటూ బదులిచ్చాడు. మోహన్ బాబు, రజినీకాంత్ మంచి స్నేహితులు అని అందరికి తెలిసిన విషయమే.