Nagma Covid Positive: వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్నా.. కరోనా పాజిటివ్ వచ్చింది – నగ్మా

నటి.. మాజీ హీరోయిన్ నగ్మాకు కొవిడ్-19 పాజిటివ్ అని వచ్చింది. కొద్ది రోజుల ముందే కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నప్పటికీ..

Nagma Covid Positive: వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్నా.. కరోనా పాజిటివ్ వచ్చింది – నగ్మా

Nagma Vaccine First Dose

Nagma Covid Positive: నటి.. మాజీ హీరోయిన్ నగ్మాకు కొవిడ్-19 పాజిటివ్ అని వచ్చింది. కొద్ది రోజుల ముందే కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నప్పటికీ పాజిటివ్ గా వచ్చినట్లు ట్విట్టర్లో పోస్టు చేసింది. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్ లో ఉన్నట్లు వెల్లడించింది.

‘కొద్ది రోజుల ముందే వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నా. టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది. ఇంట్లోనే క్వారంటైన్ లో ఉండిపోయా. అందరూ భద్రంగా ఉండండి. తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోండి. ఒకసారి వ్యాక్సిన్ డోస్ తీసుకోగానే నిర్లక్ష్యంగా ఉండకండి. #staysafe! అని నగ్మా ట్వీట్ చేశారు.

నగ్మా తన తొలి డోస్ ను ఏప్రిల్ 2న తీసుకున్నారు. అది తీసుకున్న కొద్ది రోజుల తర్వాత జ్వరం, దగ్గు, జలుబు వచ్చాయట. అప్పుడు కూడా ఆమె ట్విట్టర్లో ఇలా రాసుకొచ్చారు. ‘నేను తొలి డోసు తీసుకున్న తర్వాత నిన్నటి నుంచి బాడీ టెంపరేచర్ పెరిగినట్లుగా అనిపిస్తుంది. తలనొప్పి, జలుబు, దగ్గుగా ఉన్నాయి, కళ్లు మండుతున్నాయి. ప్రస్తుతం రెండ్రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉన్నా.

నగ్మాతో పాటు మరికొందరు సెలబ్రిటీలకు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. అక్షయ్ కుమార్, గోవిందా, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, అలియా భట్ లకు పాజిటివ్ వచ్చినట్లు స్వయంగా సోషల్ మీడియాలో అభిమానులు, ఫాలోవర్లతో పంచుకున్నారు. ఈ మేరకు హోం క్వారంటైన్ లోనే ఉన్నామని వివరించారు.