Kalyan Ram: బాలయ్య సూపర్ హిట్ రొమాంటిక్ సాంగ్‌ను పట్టుకొస్తున్న కళ్యాణ్ రామ్

నందమూరి కళ్యాణ్ రామ్ గతేడాది ‘బింబిసార’ మూవీతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సక్సెస్‌ను అందుకున్నాడు. ఈ సినిమాను ఫిక్షనల్ టైమ్ ట్రావెల్ సబ్జెక్ట్‌తో దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించగా, కళ్యాణ్ రామ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించాడు. ఇక ఈ సినిమా కథ సరికొత్తగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించారు.

Kalyan Ram: బాలయ్య సూపర్ హిట్ రొమాంటిక్ సాంగ్‌ను పట్టుకొస్తున్న కళ్యాణ్ రామ్

Nandamuri Kalyan Ram To Recreate Balakrishna's Superhit Romantic Son

Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ గతేడాది ‘బింబిసార’ మూవీతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సక్సెస్‌ను అందుకున్నాడు. ఈ సినిమాను ఫిక్షనల్ టైమ్ ట్రావెల్ సబ్జెక్ట్‌తో దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించగా, కళ్యాణ్ రామ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించాడు. ఇక ఈ సినిమా కథ సరికొత్తగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించారు.

Kalyan Ram : కొత్త కథలు, పాత్రల వైపు కళ్యాణ్ రామ్ ప్రయాణం..

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కమర్షియల్‌గానూ అదిరిపోయే కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ ఇప్పటికే తన నెక్ట్స్ మూవీని రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. ‘అమిగోస్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోండగా, ఈ మూవీలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్‌లో నటిస్తున్నాడు. కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ప్రమోషనల్ వీడియోను చిత్ర యూనిట్ షేర్ చేసింది. తన అభిమానులతో హీరో కళ్యాణ్ రామ్ ఫోన్‌లో ముచ్చటించాడు. ఈ క్రమంలో అమిగోస్ సినిమాకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

Kalyan Ram : అమిగోస్ టీజర్‌కి ముహూర్తం ఖరారు చేసిన కళ్యాణ్ రామ్..

అయితే ఈ క్రమంలోనే ఈ సినిమాలో బాలయ్య సూపర్ హిట్ రొమాంటిక్ సాంగ్‌ను రీమిక్స్ చేయబోతున్నట్లు కళ్యాణ్ రామ్ తెలిపాడు. అయితే అది ఏ పాట అని అభిమానులు అడగ్గా.. గెస్ చేయండి అంటూ ఓ క్లూ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. బాలయ్య సినిమాలోని ఆ రొమాంటిక్ సాంగ్‌ను హమ్ చేస్తూ కళ్యాణ్ రామ్ క్లూ ఇచ్చాడు. అయితే బాలకృష్ణ నటించిన ‘ధర్మక్షేత్రం’ మూవీలోని ‘‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ..’’ అనే సూపర్ హిట్ సాంగ్‌ను ఈ సినిమాలో రీమిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అమిగోస్ మూవీని రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా, గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.