Taraka Ratna Number 9 : నందమూరి తారకరత్నకు కలిసిరాని 9 అంకె.. 27న గుండెపోటు, 18న కన్నుమూత..

Taraka Ratna Number 9 : నందమూరి తారకరత్నకు కలిసిరాని 9 అంకె.. 27న గుండెపోటు, 18న కన్నుమూత..

Taraka Ratna Number 9 : తెలుగు సినీ పరిశ్రమతో పాటు నందమూరి, నారా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సినీ నటుడు నందమూరి తారకరత్న(40) కన్నుమూశారు. గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మృత్యువుతో పోరాడి ఓడారు తారకరత్న.

జనవరి 27న కుప్పంలో ఆయన తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. జనవరి 28న బెంగళూరుకి తరలించారు. అప్పటి నుంచి అక్కడే ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందించింది. తారకరత్నను బతికించేందుకు డాక్టర్లు చేసిన విశ్వ ప్రయత్నాలు నిష్ఫలం అయ్యాయి.

Also Read..Nandamuri Taraka Ratna Passes Away : నందమూరి తారకరత్న కన్నుమూత

కాగా, తారకరత్నకు 9 అంకె కలిసిరాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. జనవరి 27న ఆయనకు గుండెపోటు వచ్చింది. 27లో 2+7=9. ఇక ఫిబ్రవరి 18న తారకరత్న కన్నుమూశారు. శాశ్వతంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 18లో 1+8=9. ఇక తన సినీ కెరీర్ మొదట్లో 9 సినిమాలకు సంతకం చేశారు తారకరత్న. కానీ అందులో షూటింగ్ కు కూడా నోచుకోని సినిమాలు 6. ఇలా 9 అంకె తారకరత్నకు కలిసిరాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

* గత నెల 27న హార్ట్ స్ట్రోక్.. 2+7=9.
* ఫిబ్రవరి 18న మరణ వార్త.. ఫిబ్రవరి 18.. 1+8=9..
* ఏకంగా 9 సినిమాలకు సంతకం.

జనవరి 27న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కుప్పంలో ప్రారంభమైంది. ఇందులో తారకరత్న కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాదయాత్ర సాగుతుండగా సడెన్ గా తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలో కేసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి గ్రీన్ చానల్ ద్వారా తరలించారు. అప్పటి నుంచి తారకరత్నకు అక్కడే ప్రత్యేక వైద్య బందృం చికిత్స అందించింది.

Also Read..Taraka Ratna Demise : తారకరత్న మృతికి సీఎం జగన్, చంద్రబాబు సంతాపం.. లోకేశ్ భావోద్వేగం

గుండెపోటుకు గురైన సమయంలో తారకరత్న మెదడుకు దాదాపు 45 నిమిషాల పాటు రక్తప్రసరణ ఆగిపోవడంతో, మెదడులోని కొంత భాగం డ్యామేజ్ అయినట్లు డాక్టర్లు గుర్తించారు. సంబంధిత నిపుణులు చికిత్స చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఓ దశలో తారకరత్నను విదేశాలకు తీసుకెళతారంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత విదేశీ వైద్య నిపుణులనే బెంగళూరు రప్పించారు. అంతేకాదు, తారకరత్నను హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తారంటూ శనివారం ప్రచారం జరిగింది. కానీ అందరినీ విషాదంలో ముంచుతూ తారకరత్న తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. 23 రోజులుగా ఆయనను బతికించేందుకు డాక్టర్లు చేసిన కృషి ఫలించలేదు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తారకరత్న వయసు 40ఏళ్లు. ఆయనకు భార్య అలేఖ్యా రెడ్డి, కూతురు నిషిక ఉన్నారు. తారకరత్నది ప్రేమ వివాహం. అలేఖ్య వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి బంధువు. అలేఖ్య టాలీవుడ్ లో కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.