Niharika : మా ఆయనకు సినిమాలు చేయడం ఇష్టం లేదు.. అందుకే మానేశా : నిహారిక

మరి పెళ్లి అయ్యాక సినిమాలకి దూరంగా ఉన్నారు ఎందుకు అని ఆలీ అడుగగా..మా ఆయనకు నేను సినిమాలు చేయడం ఇష్టం లేదు. అందుకే మానేశాను. అయినా ఈ కాలంలో హీరోయిన్‌లకు పెళ్లి అయినా.......

Niharika : మా ఆయనకు సినిమాలు చేయడం ఇష్టం లేదు.. అందుకే మానేశా : నిహారిక

Nischay

Niharika :  నాగబాబు కూతురిగా, మెగా ప్రిన్స్ గా అందరికి పరిచయం నిహారిక. టీవీలో యాంకర్ గా తన ప్రయాణం మొదలు పెట్టి, యూట్యూబ్ లో సిరీస్ లతో, తర్వాత హీరోయిన్ గా, తర్వాత ప్రొడ్యూసర్ గా, టీవీ షోస్ లో గెస్ట్ గా వస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ‘ఆలీతో సరదాగా’ షోలో నిహారిక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆలీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ తన పెళ్లి, సినిమాల గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది.

Bigg Boss 5 : చీకట్లో సిరి, షన్ను రొమాన్స్.. షాకైన సన్నీ

తనది పెద్దలు కుదిర్చిన వివాహం అని, అన్న వరుణ్ తేజ్, తన హస్బెండ్ చైతన్య చిన్నప్పుడు స్కూల్ లో క్లాస్ మేట్స్ అని తెలిపింది. పెళ్ళికి ముందు హీరోయిన్ గా కూడా నటించారు. మరి పెళ్లి అయ్యాక సినిమాలకి దూరంగా ఉన్నారు ఎందుకు అని ఆలీ అడుగగా..మా ఆయనకు నేను సినిమాలు చేయడం ఇష్టం లేదు. అందుకే మానేశాను. అయినా ఈ కాలంలో హీరోయిన్‌లకు పెళ్లి అయినా కెరీర్‌ ఏం మారలేదు. సమంతకు పెళ్లికి ముందు ఎంత క్రేజ్‌ ఉండేదో, పెళ్లి అయిన తర్వాత కూడా అంతే ఉంది. మా అయన జస్ట్ సినిమాల్లో హీరోయిన్ గా వద్దన్నారు. కానీ టీవీ, వెబ్ సిరీస్, యూట్యూబ్ వాటికి అడ్డు చెప్పలేదు. అందుకే వాటిల్లో చేస్తున్నాను. బాగా మంచి పాత్ర వస్తే సినిమాల్లో మా ఆయన్ని అడిగి చేస్తాను అని తెలిపింది ఈ కొణిదెల వారమ్మాయి.

Jai Bhim : ‘జై భీమ్’ వివాదంలోకి జ్యోతిక.. మరోసారి కోర్టు నోటీసులు పంపిన వన్నియార్ సంఘం

ఎప్పట్నుంచో ప్రొడ్యూసర్ గా యూట్యూబ్ లో సిరీస్ లు నిర్మిస్తున్న నిహారిక ఇటీవల పూర్తి స్థాయి నిర్మాతగా మారి జీ5 ఓటిటి కోసం ఒక సిరీస్ ని నిర్మించారు. త్వరలో మరో సిరీస్ ని కూడా తెరకెక్కించనున్నారు. ఇంకో సిరీస్ లో యాక్ట్ చేస్తున్నారు నిహారిక. మొత్తానికి వాళ్ళ ఆయన కోసం హీరోయిన్ గా తన కెరీర్ ని వదులుకుంది నిహారిక.