Nithiin: మరోసారి సూపర్ హిట్ కాంబినేషన్ కుదిరిందిగా.. ఉగాది కానుకగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్..?

టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్స్ ఒక్కసారి వచ్చినా, వాటికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి కాంబినేషన్‌లోనే వచ్చిన సినిమా ‘భీష్మి’. ఈ సినిమాలో యంగ్ హీరో నితిన్, అందాల భామ రష్మిక మందన్న జంటగా నటించగా, ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించాడు. ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, ఈ సినిమాలో నితిన్, రష్మికల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

Nithiin: మరోసారి సూపర్ హిట్ కాంబినేషన్ కుదిరిందిగా.. ఉగాది కానుకగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్..?

Nithiin Rashmika Mandanna Venky Kudumula To Join Forces Once Again

Nithiin: టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్స్ ఒక్కసారి వచ్చినా, వాటికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి కాంబినేషన్‌లోనే వచ్చిన సినిమా ‘భీష్మి’. ఈ సినిమాలో యంగ్ హీరో నితిన్, అందాల భామ రష్మిక మందన్న జంటగా నటించగా, ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించాడు. ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, ఈ సినిమాలో నితిన్, రష్మికల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

Nithiin: అప్పుడు విక్రమ్.. ఇప్పుడు కబ్జా.. నితిన్ ప్లాన్ మామూలుగా లేదుగా!

ఈ సినిమాలో వీరిద్దరి మధ్య సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో భీష్మ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాతో దర్శకుడు వెంకీ కుడుముల కూడా తన కెరీర్‌లో బంపర్ హిట్‌ను నమోదు చేసుకున్నాడు. అయితే ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నారు. వెంకీ కుడుముల మరోసారి ప్రేక్షకులకు నచ్చే కథను నితిన్, రష్మికలతో చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

Nithiin: వెంకీ కోసం ప్రయోగం చేయబోతున్న నితిన్.. వర్కవుట్ అయ్యేనా..?

దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేయబోతున్నారట. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రాబోతున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ నెలాఖరున ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అవుతోంది. వెంకీ కుడుములతో రష్మిక మందన్న ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని చూస్తోంది.