Nithiin: ప్రభాస్ మూవీ స్టోరీలైన్‌తో నితిన్ నయా మూవీ.. వర్కవుట్ అయ్యేనా..?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, సినిమాలోని రొటీన్ సబ్జెక్ట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఇక ఈ సినిమా తరువాత నితిన్ తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అనే ప్రశ్నకు దర్శకుడు వెంకీ కుడుముల రూపంలో సమాధానం లభించింది.

Nithiin: ప్రభాస్ మూవీ స్టోరీలైన్‌తో నితిన్ నయా మూవీ.. వర్కవుట్ అయ్యేనా..?

Nithiin Venky Kudumula Movie Storyline Similar To That Of Prabhas Chakram

Nithiin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, సినిమాలోని రొటీన్ సబ్జెక్ట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఇక ఈ సినిమా తరువాత నితిన్ తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అనే ప్రశ్నకు దర్శకుడు వెంకీ కుడుముల రూపంలో సమాధానం లభించింది.

Nithiin: భార్యకు దూరంగా నితిన్.. అసలు కథ చెబుతానంటోన్న వెంకీ!

ఈ కాంబినేషన్‌లో రాబోయే సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే తాజాగా వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా కథకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. నితిన్-వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా స్టోరీలైన్ గతంలో ప్రభాస్ నటించిన ఓ సినిమాను పోలి ఉంటుందని తెలుస్తోంది. దర్శకుడు కృష్ణవంశీ, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘చక్రం’ సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఘోర పరాజయాన్ని చవిచూసిందో మనం చూశాం. ఆ సినిమాలో హీరో చనిపోతాడని తనకు ముందే తెలుస్తోంది.

Nithiin : మారేడుమిల్లి అడవుల్లో మొదలైన నితిన్ కొత్త మూవీ..

ఇప్పుడు సేమ్ ఇలాంటి స్టోరీలైన్‌తోనే వెంకీ కుడుముల కూడా ఓ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. హీరో తాను చనిపోతానని తెలుసుకుని, తన మిగిలి ఉన్న జీవితాన్ని ఎలా గడిపాడు.. అతడికి ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే యాంగిల్‌లో సినిమా కథ ఉండబోతుందట. ఇక ఈ కథకు కామెడీ అంశాలను జోడించనున్నాడట ఈ డైరెక్టర్. మరి ప్రభాస్‌కు డిజాస్టర్‌ను మిగిల్చిన ‘చక్రం’ సినిమా స్టోరీలైన్‌తో నితిన్ సినిమా చేస్తే, సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతుందేమో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు అభిమానులు.