Nithin : నితిన్ కొత్త సినిమా ప్రారంభం.. ‘పెళ్లి సందD’ హీరోయిన్‌తో

నితిన్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలు ఇవాళ జరిగాయి. ఇది నితిన్ 32వ సినిమా. ఈ సినిమాలో 'పెళ్లి సందD' హీరోయిన్‌ శ్రీలీల నటించనుంది. నితిన్ తన సొంత బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ లో..........

Nithin : నితిన్ కొత్త సినిమా ప్రారంభం.. ‘పెళ్లి సందD’ హీరోయిన్‌తో

Nithin

 

Nithin : ఇటీవల బ్యాక్ టు బ్యాక్ భీష్మ, రంగ్ దే, చెక్, మాస్ట్రో సినిమాలతో పలకరించాడు హీరో నితిన్ అందులో మూడు సినిమాలు హిట్ అవ్వగా ఒకటి మాత్రం నిరాశ పరిచింది. చివరగా మాస్ట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ అయింది. ప్రస్తుతం నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమాతో రానున్నాడు. ఈ సినిమా జులై 8న థియేటర్లలో విడుదల అవ్వనుంది. తాజాగా నితిన్ తన కొత్త సినిమాని ప్రారంభించారు.

RGV : ట్రిపుల్ ఆర్ ఫ్రెండ్‌షిప్ ఫిలిం.. ఇది అడల్ట్ సినిమా కాదు..

నితిన్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలు ఇవాళ జరిగాయి. ఇది నితిన్ 32వ సినిమా. ఈ సినిమాలో ‘పెళ్లి సందD’ హీరోయిన్‌ శ్రీలీల నటించనుంది. నితిన్ తన సొంత బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ లో ఈ సినిమా చేయనున్నాడు. ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. శ్రీలీల ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తూ వరుస సినిమాలని లైన్ లో పెడుతుంది. ఇవాళ పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలో షూటింగ్ మొదలు పెట్టనున్నారు.