Oscars95: ఆర్ఆర్ఆర్ దెబ్బకు సైలెంట్ అయిన బాలీవుడ్ బ్యాచ్.. షారుక్ తప్ప మిగతావారు మ్యూట్!

భారతీయులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆస్కార్ అవార్డు ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్‌కు రావడంతో సినీ ప్రేమికులు సంతోషంతో ఊగిపోతున్నారు. ఒక ఇండియన్ సినిమాకు చెందిన పాట నేరుగా ఆస్కార్ బరిలో నామినేట్ కావడమే కాకుండా, ఆస్కార్ అవార్డును సైతం గెలుచుకోవడంతో రాజమౌళి అండ్ టీమ్ చరిత్ర సృష్టించిందంటూ హాలీవుడ్ మీడియా మొదలుకొని లోకల్ మీడియా వరకు పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలోనూ బాలీవుడ్ మాత్రం తన బుద్దిని ఏమాత్రం మార్చుకోలేదు.

Oscars95: ఆర్ఆర్ఆర్ దెబ్బకు సైలెంట్ అయిన బాలీవుడ్ బ్యాచ్.. షారుక్ తప్ప మిగతావారు మ్యూట్!

No Bollywood Celebrities Tweets On RRR Winning Oscars Except SRK

Oscars95: భారతీయులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆస్కార్ అవార్డు ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్‌కు రావడంతో సినీ ప్రేమికులు సంతోషంతో ఊగిపోతున్నారు. ఒక ఇండియన్ సినిమాకు చెందిన పాట నేరుగా ఆస్కార్ బరిలో నామినేట్ కావడమే కాకుండా, ఆస్కార్ అవార్డును సైతం గెలుచుకోవడంతో రాజమౌళి అండ్ టీమ్ చరిత్ర సృష్టించిందంటూ హాలీవుడ్ మీడియా మొదలుకొని లోకల్ మీడియా వరకు పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలోనూ బాలీవుడ్ మాత్రం తన బుద్దిని ఏమాత్రం మార్చుకోలేదు.

Oscars95: ఆస్కార్ నామినీలకు గిఫ్ట్ బ్యాగ్.. అందులో ఏముందో తెలుసా?

ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో యావత్ సినీ సెలబ్రిటీలు, ప్రేక్షకులు రాజమౌళి అండ్ టీమ్‌ను ప్రశంసిస్తుంటే, బాలీవుడ్ స్టార్స్ మాత్రం సైలెంట్ అయిపోయారు. సౌత్ సినిమాలను ఎప్పుడూ చిన్నచూపు చూసే బాలీవుడ్, ఈసారి తన అక్కసును సైలెంట్‌గా ఉంటూ వ్యక్తపరుస్తోంది. ఏదైనా బాలీవుడ్ సినిమాకు అవార్డు వస్తే, సోషల్ మీడియాలో దానికి విషెస్ చెబుతూ సందడి చేసే బాలీవుడ్ స్టార్స్, ఇప్పుడు మాత్రం సైలెంట్‌గా ఉండటంతో అందరూ ఆవాక్కవుతున్నారు.

Oscars95: ‘ఆర్ఆర్ఆర్’పై హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ కామెంట్స్.. మండిపడుతున్న అభిమానులు!

షారుక్ మాత్రమే ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ రావడంపై తన విషెస్ చెప్పి అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి బడా స్టార్స్ కనీసం ట్విట్టర్‌లో కూడా ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌పై ట్వీట్ చేయకపోవడంతో.. ఇప్పుడు అందరూ బాలీవుడ్ స్టార్స్‌ను దుమ్మెత్తిపోస్తున్నారు. ఏదేమైనా ఆస్కార్ అవార్డు గెలిచిన ఆర్ఆర్ఆర్ కేవలం టాలీవుడ్ సత్తానే కాకుండా, యావత్ ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచానికి చూపెట్టిందని.. ఈ విషయాన్ని బాలీవుడ్ ఎప్పుటికి తెలుసుకుంటుందో అని పలువురు కామెంట్ చేస్తున్నారు.