Dasara Films: పండగ పెద్దదే.. కానీ సందడి లేని స్టార్ హీరోలు!

దసరా అంటే .. స్టార్ హీరోల సినిమా రిలీజ్ లు.. కలెక్షన్లు.. ఆ సందడే వేరు. పండగొచ్చిందంటే సినిమా రిలీజ్ లు సందడి చేస్తాయి. అందులో కాస్త పెద్ద పండగైతే.. స్టార్లు సినిమాలతో చేసే..

Dasara Films: పండగ పెద్దదే.. కానీ సందడి లేని స్టార్ హీరోలు!

Dasara Films

Dasara Films: దసరా అంటే .. స్టార్ హీరోల సినిమా రిలీజ్ లు.. కలెక్షన్లు.. ఆ సందడే వేరు. పండగొచ్చిందంటే సినిమా రిలీజ్ లు సందడి చేస్తాయి. అందులో కాస్త పెద్ద పండగైతే.. స్టార్లు సినిమాలతో చేసే హడావిడి అంతా ఇంతా కాదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. రిలీజ్ కోసం చాలా సినిమాలు వెయిట్ చేస్తున్నా.. ఈ దసరా పండగ మాత్రం పెద్ద సినిమాలు రిలీజ్ లేకుండానే.. స్టార్ హీరోలు ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యకుండానే జరుగబోతోంది.

Ajith: నా చావుకి కారణం అజితే.. హీరో ఇంటి ఎదుటే మహిళ ఆత్మహత్యాయత్నం!

దసరా పెద్ద సీజన్ అయినా కూడా ఈ సారి మాత్రం ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ లేకుండా దసరా జరుపుకుంటున్నారు జనాలు. అదికూడా పండగ ముందుకాకుండా సెలవులు అయిపోయే స్టేజ్ లో రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. దసరా పండగ సందడిని ఫస్ట్ స్టార్ట్ చేస్తున్న సినిమా మహాసముద్రం. శర్వానంద్, సిద్దార్ద్ లీడ్ రోల్స్ లో అజయ్ భూపతి డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా అక్టోబర్ 14న రిలీజ్ అవుతోంది. అక్టోబర్ 15.. పండగరోజు మాత్రం మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

Big Boss 5: ఎలిమినేషన్‌లో తొమ్మిదిమంది.. డేంజర్ జోన్‌లో ఇద్దరు!

అవికూడా చిన్న హీరోలవే. ఈమూడిట్లో ఫస్ట్ నుంచి హైప్ ఉన్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అఖిల్.. పూజాహెగ్డే జంటగా పండగ రిలీజ్ అవుతున్న సినిమా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో వస్తోంది. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి పాజిటివ్ బజ్ తో రిలీజ్ అవుతోంది. పండగరోజు రిలీజ్ అవుతున్న మరో రెండు చిన్న సినిమాలు.. వరుడుకావలెను, పెళ్లిసందడి. రాఘవేంద్ర రావుదర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి డైరెక్ట్ చేస్తున్న పెళ్ళిసందడి సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

Telugu Upcoming Films: ఫుల్ బిజీగా ఫెస్టివల్ సీజన్.. టఫ్ ఫైట్ తప్పేలా లేదు!

రొటీన్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా ఎక్స్ పెక్టేషన్స్ లేకుండానే రిలీజ్అవుతోంది. అక్టోబర్ 15నే రిలీజ్ అవుతున్న నాగశౌర్య, రీతూవర్మ సినిమా వరుడుకావలెను. లక్ష్మీ సౌజన్య డైరెక్షన్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కంటెంట్ మీద హోప్స్ తో పండక్కి రిలీజ్ అవుతోంది. ఇలా ఈ దసరా మాత్రం పెద్ద సినిమాలులేకుండా, స్టార్ హీరోలు అభిమానుల్ని ఎంటర్ టైన్ చెయ్యకుండానే జరగబోతోంది.